రైతుల ప్రయోజనాలే నూతన పాలకవర్గం పరమావధి కావాలి
గుంటూరు మిర్చి యార్డ్ నూతన ఛైర్మన్ కు మాజీమంత్రి ప్రత్తిపాటి సూచన.ఎమ్మెల్యేతో మర్యాదపూర్వకంగా సమావేశమైన కుర్రా అప్పారావు.తొలిసారి చిలకలూరిపేట ప్రాంతానికి యార్డ్ ఛైర్మన్ కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు, ఉమ్మడి గుంటూరు జిల్లా కూటమి నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ప్రత్తిపాటి, కుర్రా.
రాష్ట్ర మిర్చి రైతుల ప్రయోజనాలు, క్రయవిక్రయాల్లో వారు ఎదుర్కొనే సమస్యల పరిష్కారమే ప్రధానాంశంగా గుంటూరు మిర్చియార్డ్ నూతన కార్యవర్గం నిబద్ధతతో పనిచేయాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు.మిర్చి క్రయవిక్రయాల్లో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, కూటమిప్రభుత్వానికి రైతాంగంలో మంచిపేరు వచ్చేలా పనిచేయాలని ప్రత్తిపాటి నూతన ఛైర్మన్ కు సూచించారు.
గుంటూరు మిర్చియార్డ్ నూతన ఛైర్మన్ గా నియమితులైన కుర్రా అప్పారావు శనివారం మాజీమంత్రి ప్రత్తిపాటిని కలిసి, మర్యాదపూర్వకంగా ఆయనతో సమావేశమయ్యారు. స్థానిక క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన అప్పారావును సన్మానించి, అభినందించిన ప్రత్తిపాటి, రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా యార్డ్ కార్యకలాపాలు కొనసాగించాలని సూచించారు. గత ప్రభుత్వంలో రైతుల యార్డుకు వెళ్లడానికే భయపడ్డారు..గత ప్రభుత్వంలో ఎన్నో అవకతవకలు, అవినీతి వ్యవహారాలకు కేంద్ర బిందువుగా మారిన మిర్చియార్డుకు వెళ్లడానికే రైతులు భయపడ్డారని, తమ పంటఉత్పత్తుల్ని అమ్ముకోవడానికి కూడా కమీషన్లు చెల్లించాల్సిన దుస్థితి ఎదుర్కొన్నారని ప్రత్తిపాటి ఆవేదన వ్యక్తం చేశారు. పాదర్శక, ప్రజారంజక పాలన సాగిస్తున్న కూటమిప్రభుత్వంలో ఎలాంటి మోసాలు.
సమస్యలు లేకుండా రైతుల్లో చెరగని ముద్రపడేలా నూతన పాలకవర్గం తమ పనితీరుతో మంచి పేరు ప్రఖ్యాతులు పొందాలని ప్రత్తిపాటి సూచించారు ప్రతి రైతూ గర్వంగా ఇది మా యార్డ్.. మా ప్రభుత్వం అనుకునేలా నూతన పాలకవర్గం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాలని, అన్నదాత ప్రయోజనాలే పరమావధిగా కొత్త పాలక వర్గం వినూత్నసంస్కరణలు చేపట్టాలని సూచించారు. గతంలో మన్నవ సుబ్బారావు హాయాంలో రైతులకు ఉపయోగపడేలా, కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు.
కూటమిప్రభుత్వ ఆశీస్సులతో ఆసియాలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చియార్డ్ నూతన ఛైర్మన్ గా వివాదరహితుడు, రైతుపక్షపాతి అయిన కుర్రా అప్పారావు నియామకానికి కారకులైన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లకు, ఉమ్మడి గుంటూరు జిల్లా కూటమి నాయకత్వానికి ఈ సందర్భంగా ప్రత్తిపాటి, కుర్రా అప్పారావు కృతజ్ఞతలు తెలియచేశారు.
కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, కామినేని సాయిబాబు , జిల్లా రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, టీడీపీ నాయకులు ముద్దన నాగేశ్వరరావు, కొండ్రుగుంటూ శ్రీను, గంగా శ్రీనివాసరావు, శివరామకృష్ణ, పిల్లి కోటేశ్వరరావు , టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
#నరేంద్ర




