Monday, December 29, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshసైబర్ నేరాలపై అవగాహన : కర్నూలు పోలీస్ |

సైబర్ నేరాలపై అవగాహన : కర్నూలు పోలీస్ |

కర్నూలు :కర్నూల్ జిల్లా…సైబర్ నేరాలు, మహిళల పై జరిగే నేరాల పై అవగాహన…మహిళల భద్రతకు కు పటిష్ట చర్యలు.మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన శక్తి యాప్, శక్తి వాట్సాప్ నంబర్ల పై, మహిళల పై జరిగే నేరాలు, సైబర్ నేరాల గురించి  పాఠశాలలు, కళాశాలల్లో  జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ ల అధికారులు మరియు శక్తి టీం బృందాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని.

విద్యార్ధీనిలకు , మహిళలకు వాటి సేవలను వివరిస్తున్నారని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు  తెలిపారు. శక్తి టీం బృందాలు మహిళలకు, బాలికలకు పాఠశాల, కళాశాలలో విద్యార్థినిలకు శక్తి యాప్, సైబర్ నేరాలు , గుడ్ టచ్ & బ్యాడ్ టచ్, పోక్సో చట్టాలు, ఈవ్ టీజింగ్ లపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.

ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో శక్తి టీం బృందాలు  జన సంచారం ఉన్న ప్రాంతాలతో పాటు, పలు పాఠశాలల్లో విద్యార్థులకు  డయల్  112, డయల్ 100,1098, 1930, శక్తి యాప్ ,  మహిళలు అత్యవసర సమయాల్లో నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు శక్తి” వాట్సప్ 7993485111 నెంబర్ ను మహిళలు, చిన్నారుల భద్రత కోసం సేవ్ చేసుకోవాలన్నారు.   ఎక్కడైనా గంజాయి ,  డ్రగ్స్, మాదక ద్రవ్యాల సేవించడం చూసినా  విక్రయాలు, వినియోగం గురించి సమాచారం తెలిస్తే ఈగల్  టోల్ ఫ్రీ నంబర్ 1972 కు అందించాలన్నారు.

ఈవ్ టీజింగ్, ప్రేమ పేరుతో మోసాలు ,  మహిళలపై జరిగే నేరాల పై మరియు చట్టాల పై అవగాహన కల్పించారు. 2025  జనవరి నుండి డిసెంబర్ 27 వ తేదీ వరకు శక్తి యాప్ ను జిల్లాలో 21,033 మంది డౌన్లోడ్ చేసుకున్నారని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments