క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకొని కర్నూలు మండలం పంచలింగాల గ్రామంలో ABM చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ ప్రాంగణం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ ఎంపీ శ్రీ బస్తిపాటి నాగరాజు గారితో కలిసి కొడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.*ఈ సందర్భంగా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు స్వయంగా కబడ్డీ పోటీలో పాల్గొని యువతతో కలసి ఆటలో భాగమయ్యారు.
ప్రజాప్రతినిధులు అయినటువంటి ముఖ్యంగా ఎంపీ నాగరాజు గారు పంచలింగాల వాస్తవ్యుడు కావడం MLA శ్రీ బొగ్గుల దస్తగిరి గారు ఆ గ్రామానికి అల్లుడవడం వీరిరువురు మైదానంలోకి దిగడం పట్ల యువతలో అపూర్వమైన ఉత్సాహాన్ని కలిగించి, క్రీడల పట్ల ఆసక్తిని మరింత పెంచింది.
కబడ్డీ వంటి సంప్రదాయ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం, క్రమశిక్షణ, జట్టు భావనను పెంపొందిస్తాయని వారు పేర్కొన్నారు.యువత క్రీడల్లో పాల్గొని ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవరుచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో చర్చ్ నిర్వాహకులు, క్రీడాకారులు, యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి చర్చ్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.




