Sunday, December 28, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపోలీసుల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ |

పోలీసుల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ |

కర్నూలు : కర్నూలు సిటీ : ఫ్రెండ్లి క్రికెట్ మ్యాచ్  ఆడి సిబ్బందిని ఉత్సాహపరిచిన … కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు మరియు ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్ గారు.  క్రీడలు ఆడటం ద్వారా మానసిక ఉల్లాసం లభిస్తుందని , పోలీసుల విధి నిర్వహణ ఒత్తిడిని ఎదుర్కోనేందుకు  క్రీడలు ఎంతో దోహదపడుతాయని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు, ఎపిఎస్పీ 2  వ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్ గారులు తెలిపారు.

ఈ సంధర్బంగా  ఆదివారం కర్నూలు ఎపిఎస్పీ 2 వ బెటాలియన్  మైదానంలో  సివిల్, ఎఆర్ మరియు ఎపిఎస్పీ  పోలీసులకు నిర్వహించిన  పోలీసు జట్ల మధ్య నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ ను  కర్నూలు జిల్లా ఎస్పీ గారు , ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ లు కలిసి  ప్రారంభించారు.  క్రికెట్ ఆడి సిబ్బందిని  ఉత్సాహపరిచారు. జిల్లా సివిల్ , ఎఆర్  పోలీసుల జట్టు కు కెప్టెన్ గా కర్నూలు జిల్లా ఎస్పీ  గారు  వ్యవహరించారు. ఎపిఎస్పీ  పోలీసుల జట్టుకు కెప్టెన్ గా ఎపిఎస్పీ 2  వ బెటాలియన్ కమాండెంట్  గారు వ్యవహరించారు.

ఇరు జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లి క్రికెట్ మ్యాచ్ లో విన్నర్ టీం గా ఎపిఎస్పీ 2 వ బెటాలియన్  పోలీసులు ,  రన్నర్ టీం గా కర్నూలు జిల్లా పోలీసులు  గెలుపొందారు. ఈ సంధర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  గారు మాట్లాడుతూ…కర్నూలు జిల్లా పోలీసులకు, కర్నూలు ఎపిఎస్పీ పోలీసులకు ఫ్రెండ్లి క్రికెట్ మ్యాచ్ నిర్వహించామన్నారు .   శాంతిభధ్రతల పరిరక్షణలో నిత్యం విధుల్లో ఉండే సిబ్బందికి క్రీడలు ఫిట్ నెస్ తో  ఉండడానికి,  మానసిక నూతనోత్సహాన్ని ఇస్తాయన్నారు.

క్రీడలతో శారీరక ధృడత్వానికి, ఆరోగ్యానికి దోహదం చేస్తాయన్నారు.  గెలుపు , ఓటములు సహజమన్నారు. కర్నూలు ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్  గారు మాట్లాడుతూ…మొత్తం సంవత్సరం అంతా బందోబస్తు విధులలో ఉండే పోలీసుల ఒత్తిడిని తగ్గించడానికి, ఫిజికల్ ఫిట్ నెస్  ఉంటూ  ప్రజలకు  మేరుగైన  సేవలందించే ఉద్దేశ్యంతో  పోలీసులు బాగా పని చేయాలని ఈ ఫ్రెండ్లి క్రికెట్ మ్యాచ్ నిర్వహించామన్నారు.ఈ కార్యక్రమంలో   కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్, అసిస్టెంట్ కమాండెంట్ లు ఎస్ . ఎం. భాషా, సుధాకర్ రెడ్డి,  వెంకటరమణ,  సిఐలు , ఆర్ ఐలు, ఎస్సైలు, సివిల్, ఎఆర్, ఎపిఎస్పీ , ఎస్డీఆర్ ఎఫ్  పోలీసులు  ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments