పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫాతిమాపురంలో శనివారం రాత్రి రక్షణ కవచం లేని బావి ఓ యువకుడి ప్రాణం తీసింది.
మద్యం తాగి బావి గోడపై కూర్చున్న బాజీ (25) అనే యువకుడు, ఒక్కసారిగా వెనక్కు బావిలో పడిపోయి ఊపిరాడక మృతిచెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.




