సెక్యులర్ వ్యవస్థను కాపాడేది కమ్యూనిస్టులే
దోనేపూడి శంకర్
భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా పాతబస్తీ గొల్లపాలెం గట్టు 50 డివిజన్ లో ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా అమరవీరులను స్మరిస్తూ జరిగిన సభకు డివిజన్ పార్టీ కార్యదర్శి మోకా దుర్గారావు ఇలియాస్ చిన్న అధ్యక్షత వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రసంగిస్తూ భారత స్వతంత్ర సంగ్రామంలో ఇసుమంత పాత్రలేని సంఘపరివార శక్తులు దేశభక్తి గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కాళ్ళు మొక్కి కప్పం గట్టి అధికారాన్ని కాపాడుకున్న సంస్థానా దిశలు ఈరోజున బిజెపిలో కేంద్ర మంత్రులుగా, ముఖ్య మంత్రులుగా కీలకమైన స్థానాల్లో ఉన్నారని, దేశం కోసం త్యాగం చేసిన కమ్యూనిస్టులు 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో ఎస్వీ ఘాటే ప్రధాన కార్యదర్శిగా సిపిఐ ఏర్పడిందని ఆనాడే సంపూర్ణ స్వతంత్ర నినాదాన్ని ముందుకు తీసుకువెళ్లిందని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని కనీసం లాఠీచార్జి దెబ్బలు తిన్న నాయకుడు బిజెపిలో ఒక్కరు కూడా లేరని” దయ్యాలు వేదాలు వలిస్తున్నట్లుగా”
భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోడీ అమిత్ షాలు దేశభక్తి గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. మహాత్మా గాంధీని చంపిన ఈ దేశభక్తులు దురదృష్టవశాత్తు. ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారని మోప్రగల్బాలు పలుకుతున్నారని అర్బన్ నక్సలైట్లు అని ముద్ర వేసి పట్టణ ప్రాంతాల్లో ప్రజల కోసం ప్రజా సమస్యలపై పోరాటం చేసే కమ్యూనిస్టులపై ఉక్కు పాదం మోపాలని చూస్తున్నారని భవిష్యత్తులో కమ్యూనిస్టులు అందరూ కలిసి ఒకే జెండాగా Krne దాల్చాలని అదే కమ్యూనిస్టులుగా అందించేటువంటి నిజమైన నివాళి అన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మోడీ, ప్రభుత్వానికి భాకాలు ఊదుతున్నారని, అదాని ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మార్చటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ వైపుగా ప్రైవేటీకతవైపు, కార్పొరేట్లవైపు ప్రభుత్వం అడుగులు వేస్తున్నారని విమర్శించారు అనంతరం సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు తాడిపైడియా ప్రసంగిస్తూ గొల్లపాలెం గట్టు ప్రాంతంలో భారత కమ్యూనిస్టు పార్టీకి మాత్రమే పోరాట చరిత్ర ఉందని,.
సుఖ మంచి రంగారావు ఎస్ వెంకటేశ్వరరావు కాగితాల కృష్ణమూర్తి కొండ్ర బాబురావు నడకుదిటి హేమరాజ్ మరియు గాడి మాణిక్యాలరావు వంటి వారు ప్రజలతో మమేకమై ఈ ప్రాంతంలో స్థానికంగా అనేక ఉద్యమాలు నిర్మించారని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరము పునరకితం కావాలని తాడిపడియా అన్నారు .
తొలుత అమరవీరులు సుంకర భాస్కరరావు గాడి మాణిక్యాలరావుల శాఖ వద్ద పతాకావిష్కరణ గావించి అనంతరం కార్మిక విజ్ఞాన సమితి వద్ద 37 మంది అమరవీరుల చిత్రపటాలతో కూడిన ఫ్లెక్సీ వద్ద పుష్పాంజలి ఘటించారు.
అనంతరం కార్మిక విజ్ఞాన సమితి వద్ద ప్రజలకు 100 సంవత్సరాల పండుగ సందర్భంగా ఫలాలను పంచటం జరిగింది.. పై కార్యక్రమాలలో నగరపార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు కొట్టు రమణారావు..
, నగర కార్యవర్గ సభ్యులు,సింగరాజు సాంబశివరావు నగర సమితి సభ్యులు పగిడి కత్తుల రాము, గాడి రాము, మురుగేషన్ రాము, పిట్టా అప్పారావు, బి,, నరసింహరాజు,. కాగితాల కనకారావు, టీ ధనుంజయ కుమార్, మహిళా సమాఖ్య నాయకురాలు రావాడ దేవుడమ్మ, aiyf నాయకులు లంకె సాయి, పీత శేఖర్, బి. వాసు, చేకూరి నాగేశ్వరరావు.
సయ్యద్ హకీమ్, ఎం గోపికృష్ణ, చెక్క శ్రీనివాసరావు, పేటేటి రాజేష్, తుపాకులు నాగేశ్వరరావు, ఒడుగు శ్రీనివాసరావు,,g చందర్రావు, కర్రీ రాజేష్ తదితరులు పాల్గొన్నారు
మోకా దుర్గారావు ఇలియాస్ చిన్నా
సిపిఐ కార్యదర్శి
5o డివిజన్ శాఖ






