Monday, December 29, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు సచివాలయాల కీలక నిర్ణయం |

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు సచివాలయాల కీలక నిర్ణయం |

*గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు ఎలా బడితే అలా బయటకు వెళ్ళటం కుదరదు అధికారి పర్మిషన్ తప్పనిసరి*

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉద్యోగులు తమ విధులకు కచ్చితంగా హాజరు కావాల్సిందే.

అధికారులు చెప్పారని ఇతర కార్యాలయాల్లో పనిచేయడం లేదా క్షేత్రస్థాయి పరిశీలనల పేరుతో బయట తిరగడం వంటివి ఇకపై అనుమతించరు. ప్రతిరోజూ నిర్ణీత సమయంలోగా యాప్‌లో తమ హాజరును తప్పనిసరిగా నమోదు చేయాల్సిందే. రీ సర్వేలో పాల్గొంటున్న కొందరు సర్వేయర్లకు మాత్రమే ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉంది. మిగిలిన వారందరూ ఈ నియమాన్ని పాటించాల్సి ఉంటుంది.

ఒకవేళ క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడం తప్పనిసరి అయితే.. అందుకు అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. రాష్ట్ర సచివాలయాలశాఖ ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టింది.

ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో గ్రామ, వార్డు సచివాలయాల పనితీరుపై చర్చ జరిగింది. ఈ చర్చలో సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.

సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న సమాచారంతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. ఈ కొత్త నిబంధనల వల్ల సచివాలయాల సేవలు ప్రజలకు మరింత చేరువ అవుతాయని అధికారులు భావిస్తున్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేయాల్సిన ఉద్యోగులు చాలామంది ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో అనధికారికంగా డిప్యుటేషన్లపై పనిచేస్తున్నారని గుర్తించారట. ఈ విషయాన్ని గమనించిన సచివాలయాల శాఖ రద్దు చేసింది. అంతేకాదు రీసర్వేలో పాల్గొంటున్న సర్వేయర్లు మినహాయింపు ఇచ్చారు.

. అయితే మిగిలిన సిబ్బంది కచ్చితంగా సచివాలయాల్లోనే పనిచేయాలి. అయితే ఈ రీసర్వేలో పాల్గొంటున్న సర్వేయర్లలో కూడా అందరికీ మినహాయింపు లేదు.. జాయింట్ కలెక్టర్ సూచించిన వారికి మాత్రమే వెసులుబాటు ఉందని గమనించాలి. రీసర్వేలో పనిచేస్తున్న సర్వేయర్లకు కూడా కొన్ని నిబంధనలు విధించారు. వారు పనిచేస్తున్న ప్రాంతంలోనే హాజరు నమోదు చేసుకోవాలి.

ఇది వారి పనితీరును పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుంది. ఈ చర్యలన్నీ సచివాలయాల వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉద్దేశించినవి.

సచివాలయాల పర్యవేక్షణ కోసం అధికారుల నియామకాలకు సంబంధించి మూడు దశల జిల్లా, పురపాలక, మండల స్థాయిల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా స్థాయిలో పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ఒక అధికారిని నియమిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి 13 జిల్లాల్లో అధికారులు ఉన్నారు.

మరో 13 మంది త్వరలో ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. పురపాలక, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు ఒక్కో అధికారి చొప్పున మొత్తం 123 మందిని కేటాయిస్తారు. ఇది పట్టణ ప్రాంతాల్లోని సచివాలయాల పర్యవేక్షణను పటిష్టం చేస్తుంది. మండలాల వారీగా చూస్తే, ప్రతి మండలానికి ఒక అధికారి చొప్పున 660 మందిని నియమించనున్నారు.

ఇప్పటికే 600 మంది ఎంపిక పూర్తయింది. మిగిలిన మండలాలకు వచ్చే నెల మొదటి వారంలో అధికారులు అందుబాటులోకి వస్తారు. ఈ నియామకాలతో సచివాలయాల పనితీరును మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు కూడా మారబోతున్నాయి..

ఇకపై స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా మార్చనున్నారు. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మార్పునకు సంబంధించి ప్రతిపాదనల్ని అధికారులు ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments