*ఎన్టీఆర్ జిల్లా
*ఆరోగ్యం, కాలుష్య రహిత భవితకు సైకిల్ సవారీ..*
– *పెడల్ ఫర్ ఫిట్‌నెస్ స్ఫూర్తితో ప్రతిఒక్కరూ ముందుకు సాగాలి*
– *జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ*
ఆరోగ్యకర జీవితంతో పాటు కాలుష్య రహిత భవిష్యత్తుకు సైకిల్ సవారీ దోహదం చేస్తుందని.. చిన్నారులు, యువత సైక్లింగ్‌ను ఓ ఆనందకర అలవాటుగా చేసుకొని శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ఆన్ సండేస్ సైకిల్ రన్ కార్యక్రమం నగరంలోని డా. బీఆర్ అంబేద్కర్ స్మృతివనం వద్ద జరిగింది. ఇందులో భాగంగా కలెక్టర్ లక్ష్మీశ సైక్లింగ్‌ను జెండా ఊపి ప్రారంభించడంతో పాటు 50 మందికిపైగా చిన్నారులతో పాటు క్రీడా శాఖ అధికారులు, సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులతో కలిసి బెంజ్ సర్కిల్, పాలీ క్లినిక్ రోడ్డు, పీబీ సిద్ధార్థ కళాశాల, రెడ్ సర్కిల్ మీదుగా దాదాపు 9 కి.మీ. సైక్లింగ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ
శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యమూ అంతే ముఖ్యమని.. సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవడంతో పాటు భావితరాలకు కాలుష్య రహిత పర్యావరణాన్ని వారసత్వ సంపదగా అందించేందుకు ప్రతిఒక్కరూ సైక్లింగ్ ను హాబీగా మార్చుకొని ముందుకువెళ్లాలని, ఓ మంచి అలవాటు ఎన్నో విజయాలకు సోపానమవుతుందని పేర్కొన్నారు.
అందుకే అవగాహన పెంచుకొని సైక్లింగ్ ను అభిరుచిగా మార్చుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో డీఎస్‌డీవో కాకర్ల కోటేశ్వరరావు, జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులు సుగుణరావు, కోచ్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
(డీఐపీఆర్వో, ఐ అండ్ పీఆర్, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)






