తెలుగుదేశం పార్టీ లో ఉన్న ఆర్యవైశ్య ప్రముకులు ఎందుకు స్పందించడంలేదు ? మీరు ఆర్యవైస్యులు కాదా ? – వెలంపల్లి
పొదిలి ఎస్సైని వెంటనే సస్పెండ్ చేయాలి – వెలంపల్లి
ఆర్యవైశ్యుల పై జరుగుతున్నా వరుస దాడుల పై హోమ్ మంత్రి అనిత స్పందించాలి – వెలంపల్లి
ఆర్య వైశ్య మహిళ జ్యోతి పై పోలీసుల బెదిరంపులు హేయం – వెలంపల్లి
కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు రక్షణ కరువైందని రాష్ట్రంలో వరుసగా అనేక చోట్ల ఆర్యవైశ్యుల పై దాడులు చేస్తున్నారని ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎసి సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు తన కార్యాలయం నుంచి సోమవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసారు.
ఆ ప్రకటనలో వెలంపల్లి మాట్లాడుతూ ఓ ప్రక్కన ఆర్యవైశ్యుల వ్యాపారాల పై అధికారుల దాడులు మరొపక్కన పోలీసుల వేధింపులతో ఆర్యవైశ్యులను రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. పొదిలిలో ఓ ఆర్యవైశ్య వ్యాపారస్తుడైన అవినాష్ ను అక్కడ సంబంధిత ఎస్సై దుర్బాషలాడి చితకబాధి లాఠీతో రక్తం వచ్చేడట్టు కొట్టినటువంటి వైనం చూస్తుంటే ఆర్యవైశ్యులంటే ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులకు చులకనభావంగా ఉందన్నారు.
రక్త స్రావంతో ఉన్నటువంటి అవినాష్ ఆసుపత్రిలో వైద్యం చేపించుకుందామని వెళ్తే ఆసుపత్రి నుంచి కూడా తీసుకువచ్చి మరల కొట్టారు. దానిని ప్రశ్నించినటువంటి అతని తండ్రిని కూడా పోలీసులు కొట్టడాన్ని తీవ్రంగా కండించారు. ఇది యావత్తు ఆర్యవైశ్యుల పై దాడి జరిగిందని భావిస్తున్నట్లు తెలిపారు. సంబంధిత ఎస్సై ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే సస్పెండ్ చేసి అయన పై చట్టప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
దీనిపై హోమ్ మంత్రి వెంటనే స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్దమవుతామన్నారు. పొట్టి శ్రీరాములు గారికి విగ్రహం కడుతున్నామని చందాలు వాసులు చేయడం కాదు ముందు ఆర్యవైశ్యులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసారు.
పల్నాడు పోలీస్ స్టేషన్ లో ఓ ఆర్య వైశ్య మహిళను అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్ లో ఉంచడాన్నీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్యవైశ్యులంటే ఈ ప్రభుత్వానికి అంత చులకనగా ఉందా అని ప్రశ్నించారు. జ్యోతి గారిని అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్ సెల్ లో ఉంచడమేంటి.
మహిళకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులు ఇంత నీచంగా అర్ధరాత్రి వరకు ఆర్యవైశ్య మహిళను పోలీస్ స్టేషన్ లో ఉంచడమే కాకుండా 72 సంవత్సరాల వయసు కలిగి నడవలేని పరిస్థితి లో ఉన్న జ్యోతి గారి అత్తాగారైన కోడూరు మహాలక్ష్మి గారిని స్టేషన్ కి తీసుకువెళ్లిన వైనం చూస్తుంటే మహిళలంటే ఈ ప్రభుత్వానికి ఇంత చులకన అని ప్రశ్నించారు.
పదే పదే లోకేష్ గారు ప్రస్తావించే రెడ్ బుక్ రాజ్యాంగం ఆర్యవైశ్యుల పైన ఆర్యవైశ్య మహిళల పైన అవలంబిస్తున్నారన్నారు.
ఈ వరుస దాడుల పై రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హోమ్ మంత్రి అనిత స్పందించకపోతే యావత్తు వ్యాపారస్తులను కలుపుకొని రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఆర్యవైశ్యుల పై జరిగిన వరుస దాడులను తెలుగుదేశం పార్టీ లో ఉన్న ఆర్యవైశ్య ప్రముకులు ఎందుకు స్పందించడంలేదు మీరు ఆర్యవైశ్యులా కాదా అని ప్రశ్నించారు. ఈ వైఫల్యాలకు కారణమైన హోమ్ మంత్రి అనిత వెంటనే రాజీనామా చేయాలనీ డిమాండ్ చేసారు.




