కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం గ్రామం….
ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయాలో ఒక్కటి అయిన అన్నవరం “శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం” వద్ద వచ్చే భక్తులకు నిత్యం ఆటంకాలు కలుగుతూనే ఉన్నాయి… వివరాలలోకి వెళితే కొండాపైకి వెళ్లే మెట్ల దారి ముఖద్వారం ప్రక్కన భక్తులకు సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రసాదం కౌంటర్ ఎదురుగా, భక్తులకు ఇబ్బందులకు గురయ్యేలా పలు అనధికార వ్యాపారాలు నిర్వహిస్తూ ప్రసాదం తీసుకునేందుకు వెళ్లే భక్తులకు కనీసం కౌంటర్ వద్దకు వెళ్లేందుకు కనీసం కొంత దారిలేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు…
దూర ప్రాంతాలు నుండి వేలాది వాహనాలు, మోటార్ సైకిల్, ఆటోలుపై వచ్చే భక్తులు ఎంతో భక్తితో వారు ఇంటికి సత్యదేవుని ప్రసాదాలు తీసుకుని వెళ్లేందుకు ఇక్కడకు రావడం జరుగుతుంది, మరియు ఆలయ ముఖ ద్వారం వద్దనే సత్యదేవునికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకొని, కానుకలు హుండీలో వేయడం జరుగుతుంది…
ఎప్పుడూ భక్తులతో రద్దిగా ఉండే ఈ ప్రసాదం, ఆలయ ముఖద్వారం ముందు అనధికార వ్యాపారాలు నిర్వహిస్తూ ఉండటం వలన భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు… ఇప్పటికయినా దేవస్థానం అధికారులు స్పందించి అనధికారంగా నిర్వహిస్తున్న వ్యాపారాలు తొలగించి భక్తులకు ఇబ్బందులకు కలగకుండా చూడాలని కోరుతున్న భక్తులు….
# Dadala Babji




