విడిపోయి చెడిపోయే కంటే… ఐక్యతతో అభివృద్ధి సాధించుకుందాం: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
గుల్జార్ చౌక్ మసీద్ కాంప్లెక్స్ ను…. ప్రారంభించిన ఎమ్మెల్యే రాము
మైనార్టీ సోదరులందరూ కలిసి పని చేస్తే… గత పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించుకోవచ్చు: ఎమ్మెల్యే
ఒకే ఒక్క మాటతో దుర్భరంగా ఉన్న… షాదీఖానా ప్రాంగణాన్ని శుభ్రం చేసుకున్నాం
గుడివాడలో మైనార్టీ సోదరులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత నాది…
విభజన రాజకీయాలతో వచ్చే ప్రయోజనాలు నాకనవసరం…
గత ప్రభుత్వ విధ్వంస పాలనలో… మైనార్టీ సోదరులకు తీవ్ర నష్టం
ఒక్కసారి కూర్చుంటే అయిపోయే సమస్యలను… ఐదేళ్లలో పరిష్కరించలేకపోయారు
గత టిడిపి ప్రభుత్వంలో శంకుస్థాపన భవనం… తిరిగి కూటమి ప్రభుత్వంలో ప్రారంభమైంది
మైనార్టీ సోదరులందరూ ఐక్యతతో ముందుకు సాగితే…. ఎంతో అభివృద్ధి సాధించుకోవచ్చు
కొత్త ఏడాదిలో గుడివాడకు మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులు రానున్నాయి…
గుడివాడ డిసెంబర్ 29:ప్రజలతో మనందరం కలిసి ఐక్యతతో ముందుకు సాగుతూ గుడివాడ అభివృద్ధిని సాధించుకుందామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. కొత్త సంవత్సరంలో గుడివాడ అభివృద్ధికి మరిన్ని ప్రాజెక్టులు రానున్నట్లు పేర్కొన్న ఎమ్మెల్యే విభజన రాజకీయాలతో వచ్చే ప్రయోజనాలు నాకనవసరమని స్పష్టం చేశారు.
గుడివాడ పట్టణం మేదర్ బజార్ రోడ్డులో రూ.75 లక్షల నీధులతో నిర్మాణం పూర్తి చేసుకున్న గుల్జార్ చౌక్ మసీద్ కాంప్లెక్స్ భవనాన్ని మైనార్టీ పెద్దలు… కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాము శనివారం ఉదయం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కాంప్లెక్స్ దుకాణదారులు ఎమ్మెల్యే రాముకు ధన్యవాదాలు తెలిపారు. ఏడేళ్లుగా ఎవరూ పట్టించుకోని తమ సమస్యను పరిష్కరించినందుకు ధన్యవాదాలు చెప్పారు.
అనంతరం జరిగిన సభ వేదికపై మసీద్ కమిటీ అధ్యక్షుడు షేక్ ఇబ్రహీం మైనార్టీ పెద్దలు… ఎమ్మెల్యే రాము మరియు కూటమి నాయకులను ముస్లిం సాంప్రదాయం ప్రకారం సత్కరించారు. ఈ సందర్భంగా మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
సభ వేదికపై ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ…. గత పాలకుల ద్వంద విధానాలతో టిడిపి ప్రభుత్వంలో ప్రారంభమైన మసీద్ భవన నిర్మాణాన్ని, అడ్డుకున్నారన్నారు. అసంపూర్తిగా ఉన్న భవనాన్ని, కూటమిపాలనలో పూర్తి చేసి నేడు ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు.
విభజన రాజకీయాలతో గత పాలకులు చిన్న చిన్న విషయాలను పెద్దవి చేస్తూ రాజకీయ లబ్ధి పొందారని… నాకు అలాంటి రాజకీయాలు అవసరం లేదని పేర్కొన్నారు. ఒక పూట కూర్చుంటే అయిపోయో కాంప్లెక్స్ సమస్యను పరిష్కరించడానికి, గత పాలకులు కనీస చర్యలు తీసుకోలేదని కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో సమస్యను పరిష్కరించడమే కాక 28 దుకాణాల కాంప్లెక్స్ భవన నిర్మాణాన్ని పూర్తి చేశామన్నారు.
మైనార్టీ సోదరులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత నాదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము పునరుద్ఘాటించారు. 18 నెలల కూటమి పాలనలో పట్టణంలో ఎంతో మార్పు చూసామని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి నియోజకవర్గంలో జరుగుతుందన్నారు.
నా చిన్నప్పుడు ఇదే మేదర్ బజార్ రోడ్డులో మా బాబాయ్ షెడ్డులో సెలవుల్లో పనిచేసే వాడిని, ఈ ప్రాంతంతో తనకు ఎంతో అనుబంధం ఉందా అని నాటి రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు.
మైనార్టీ సోదరులందరూ ఐక్యంగా ముందుకు సాగుతూ మరింత అభివృద్ధిని సాధించుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర్ రావు, గుల్జర్ చౌక్ మసీద్ కమిటీ అధ్యక్షులు షేక్ ఇబ్రహీం, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్,మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, మసీదు కమిటీ ఉపాధ్యక్షుడు జమాల్ సాహెబ్, కార్యదర్శి మహమ్మద్ సర్తాజ్ భాషా, మండల టిడిపి అధ్యక్షుడు వాసే మురళి, టిడిపి నాయకులు పిన్నమనేని బాబ్జి, చేకూరు జగన్మోహన్రావు, షేక్ మౌలాలి, షేక్ సర్కా,మజ్జాడ నాగరాజు, షేక్ జానీ, షేక్ ముజాహిద్, సయ్యద్ మున్వర్, మహమ్మద్ రఫీ,సయ్యద్ గఫార్, సయ్యద్ జబీన్, గోకవరపు సునీల్, పట్టపు చిన్న, ముస్లిం మత పెద్దలు, టిడిపి మైనార్టీ సెల్ నాయకులు, స్థానిక దుకాణదారులు పాల్గొన్నారు.




