Home South Zone Andhra Pradesh బాపట్లలో మున్సిపాలిటీ నిర్వాకం |

బాపట్లలో మున్సిపాలిటీ నిర్వాకం |

0
0

బాపట్లలో మున్సిపాలిటీ నిర్వాకం – సైడ్ కాలువలు ప్రాణాలు తీసే గోతుల్లా మారాయా?
బాపట్ల: బాపట్ల పట్టణం చీలురోడ్డు సెంటర్ వద్ద, జామ్ జామ్ టీ కొట్టు పక్కనే ఉన్న సైడ్ కాలువ మరోసారి మున్సిపాలిటీ నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. భద్రతా రాళ్లు, కవర్లు లేకుండా వదిలేసిన కాలువలో  వ్యక్తి పడిపోవడం కలకలం రేపింది.

బస్సు వెళ్లిపోతుందన్న తొందరలో ముందున్న డ్రైనేజ్ మీద కాలు పెట్టి వేగంగా వెళ్లే క్రమంలో సమతుల్యం కోల్పోయిన వ్యక్తి నేరుగా సైడ్ కాలువలోకి పడిపోయాడు. క్షణాల వ్యవధిలో ప్రాణాపాయం సంభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఉన్న కొంతమంది యువకులు అపెద్దాయన్ని బయటికి లాగినారు అదృష్టవశాత్తూ తృటిలో ప్రాణాలు దక్కాయి.
అయితే, కాలువలో పడిన అతని మొబైల్ ఫోన్ పూర్తిగా పాడైపోయింది. ఒకవేళ కొద్దిగా ఆలస్యం జరిగి ఉంటే పరిస్థితి ఎంత ఘోరంగా మారేదో ఊహించడానికే ప్రజలు భయపడుతున్నారు.

రోజురోజుకీ మున్సిపాలిటీ నిర్లక్ష్యం పెరుగుతుండటంతో బాపట్ల పట్టణంలోని సైడ్ కాలువలు ప్రజలకు ఉచ్చు పాశాలుగా మారాయని స్థానికులు మండిపడుతున్నారు. ప్రాణాలు పోయాకే అధికారులు కదలాలా? ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవడం ఎందుకు చేతకావడం లేదు?

తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి సైడ్ కాలువలపై భద్రతా రాళ్లు ఏర్పాటు చేయాలని, లేదంటే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

#నరేంద్ర

NO COMMENTS