అమరావతి రైతు రామారావు ప్రాణత్యాగం చేసినా కళ్ళు తెరవని కూటమి ప్రభుత్వం
అప్పుడు, ఇప్పుడు అమరావతి రైతులు, ప్రజలకు కష్టాలు తప్పడం లేదు
రామారావు కుటుంబం, రైతుల పట్ల కనికరం చూపని పాలకులు
న్యాయం చేస్తామని మాటలే తప్ప, చేతలు లేవు
అమరావతిలో కార్పొరేట్లకు రెడ్ కార్పెట్, భూములు ఇచ్చిన రైతులకు మొండి చెయ్యి
రామారావు కుటుంబానికి న్యాయం చేయాలని, 50 లక్షల ఆర్థిక సహాయం చేయాలని, రైతుల, ప్రజల కోర్కెలు, హామీలు తీర్చాలని కోరుతూ సి ఆర్ డి ఏ కార్యాలయం వద్ద సిపిఎం ఆందోళన
సిఆర్డిఏ అడిషనల్ కమిషనర్ కు వినతిపత్రం సమర్పించిన నేతలు
ఆందోళనలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. బాబురావు నేతలు ఎం. రవి, అజయ్ కుమార్, శివశంకర్, బూరుగ వెంకటేశ్వరరావు తదితరులు
#నేడు అమరావతి లోని రాయపూడి లో ఉన్న సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం వద్ద రామారావు కుటుంబానికి న్యాయం చేయాలని, అమరావతి రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
@ఈ ధర్నాలో అమరావతి రైతులు, రామారావు కుటుంబ సభ్యులు, సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు.
@రామారావు చిత్రపటాలు, బ్యానర్లు చేతబట్టి న్యాయం చేయాలని నినాదాలు ఇస్తూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.
@తదనంతరం సి ఆర్ డి ఏ అదనపు కమిషనర్ భార్గవ కు మరియు మున్సిపల్ మంత్రి కార్యాలయం అధికారులకు నేతలు వినతి పత్రాలు సమర్పించారు.
@రామారావు కుటుంబానికి 50 లక్షలు ఆర్థిక సహాయం అందించాలని, రామారావు, రైతులు కోరిన విధంగా ప్లాట్ల కేటాయింపులోని అవకతవకలను సరిదిద్ది తక్షణమే ప్రత్యామ్నాయంగా సరైన ప్లాట్లు కేటాయించాలని వినతి పత్రంలో కోరారు.
@వీలైన మేరకు ఇళ్లు కోల్పోకుండా రోడ్ల వెడల్పు చేపట్టాలని, అనివార్యమైతే ఇళ్ల ప్లాట్లు రైతులు కోరినచోట్ల కేటాయించాలని, ఉదారంగా నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
@రోడ్ల విస్తరణలోను ప్రణాళికాబద్ధంగా కాకుండా, రోజుకొక ప్రతిపాదనలు పెడుతూ గందరగోళం సృష్టించకుండా పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు.
@రైతుల ప్లాట్లను అభివృద్ధి చేయాలని, రుణాలు ఇప్పించాలని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, జరీబు గుర్తింపు, ఉచిత విద్య, వైద్యం, స్థానికులకు ఉపాధి తదితర హామీలు నెరవేర్చాలని కోరారు.
#ధర్నా సందర్భంగా బాబురావు, అమరావతి కార్యదర్శి రవి, జిల్లా నేత వెంకటేశ్వర్లు, రైతు నేతలు శివశంకర్, అజయ్ కుమార్ లు మాట్లాడుతూ……
*ప్రభుత్వాలు మారినా, అమరావతి రైతులు, పేదల వెతలు తీరటంలేదు*
*మందడం రైతు రామారావు మృతికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి*
*రామారావు, రైతులు, ప్రజల మనోవేదను ప్రభుత్వం గమనించాలి*
*రామారావు మృతి చెంది మూడు రోజులు గడిచినా, ప్రభుత్వం, సిఆర్డిఏ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తగదు*
*రైతు రామారావు, స్థానిక ప్రజలు లేవనెత్తుతున్న అంశాలపై ప్రభుత్వం స్పందించాలి*
*కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరుస్తూ, భూములు ఇచ్చిన రైతులు, ఉపాధి కోల్పోయిన పేదలను చిన్న చూపు చూడటం క్షంతవ్యం కాదు*
*కార్పొరేట్లకు యుద్ధ ప్రాతిపదిక మీద భూముల కేటాయించే సర్కార్, రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీల నెరవేర్చటంలో మీన మేషాలు లెక్కించడం శోచనీయం*
*రైతులకు ప్లాట్ల కేటాయింపులో అవ కతవకలు జరిగాయి, పెద్దలకు ,బడా కంపెనీలకు విలువైన స్థలాలు కేటాయిస్తున్నారు, భూములు ఇచ్చిన రైతులకు పనికిరాని ప్లాట్లు కేటాయిస్తున్నారు*
*11 సంవత్సరాల తర్వాత జరీబు భూములు తెల్చడానికి కమిటీలు వేయటం హాస్యాస్పదం*
*బడా సంస్థలకు ఆగమేఘాల మీద మేళ్లు చేస్తూ, రైతులు ,పేదల సమస్యలపై మాత్రం కమిటీల పేరుతో కాలయాపన చేయటం గర్హనీయం*
*గత వైసిపి ప్రభుత్వం అమరావతిని నిర్వీర్యం చేసింది, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది*
*కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమరావతి పట్ల ఎల్లప్పుడూ నిర్లక్ష్య వైఖరినే ప్రదర్శిస్తోంది, నిధులు కేటాయించకుండా, అప్పులతో సరిపెడుతోంది*
*ప్రధాని మోడీ చెంబుడు నీళ్లు ,గుప్పెడు మట్టి ఇచ్చి సరిపెట్టారు*
*గతంలో నాలుగేళ్లు, నేడు రెండేళ్లు టిడిపి, కూటమి అధికారంలో ఉన్నా, రాజధాని అభివృద్ధి నత్తనడకనే సాగుతున్నది*
*అభివృద్ధి పనులు పునః ప్రారంభమైనా, రాజధాని రైతులు, ప్రజలకు లబ్ధి పూర్తిగా చేకూరడం లేదు*
*ఎన్నికలకు ముందు మాట మాత్రం చెప్పకుండా, అధికారంలోకి రాగానే మళ్లీ 44 వేల ఎకరాల భూములు సమీకరిస్తామని ప్రకటించడం రైతులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నది*
*నాడు వైసీపీ నేతలు స్మశానమని ఎగతాళి చేస్తే, నేడు ముఖ్యమంత్రి మున్సిపాలిటీగా మారుతుందని చెప్పటం బాధాకరం*
*అప్పుడు, ఇప్పుడు రైతులు, అమరావతి ప్రజలకు కష్టాలు తప్పడం లేదు, హామీలు నెరవేరటం లేదు. మనోవేదన తప్పలేదు, రైతుల భూములు త్యాగాలే కాదు, ప్రాణ త్యాగాలు తప్పడం లేదు*
*మరో దశ భూ సమీకరణతో మొదటి దశలో భూములు ఇచ్చిన రైతులకు కూటమి ప్రభుత్వం తీవ్ర మనోవేదనను మిగిల్చింది*
*11 సంవత్సరాలు గడిచినా, కేంద్రం ఇప్పటికీ పార్లమెంటులో అమరావతిపై చట్టం చేయలేదు ,గెజిట్ విడుదల చేయలేదు, కుంటి సాగులతో కాలయాపన చేస్తున్నారు*
*పార్లమెంట్ లో చట్టంపై కూటమి పెద్దలు నోరు మెదపకపోవడం బాధాకరం*
*ఇప్పటికైనా ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని తక్షణమే రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి*
*రామారావు కుటుంబానికి న్యాయం చేయాలి, 50 లక్షల పరిహారం చెల్లించాలి, ప్లాట్ల కేటాయింపులు మార్పులు చేయాలి*
*లేని ఎడల రాజధానిలో మరో దశ ఉద్యమం తప్పదు*
*సిపిఎం నాడు, నేడు రైతులు ,అమరావతి ప్రజల తరఫున నిలుస్తుంది పోరాడుతుంది*
సిఆర్డిఏ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో రామారావు కుటుంబ సభ్యులు చుండూరు నరేంద్ర, సిపిఎం నాయకులు ఎం భాగ్యరాజు కుంభ ఆంజనేయులు ఎస్ కే ఎర్ర పేరు పల్లె కృష్ణ
కే జగదీశ్వర్ రెడ్డి
కె రామకృష్ణ ఎస్కే జానీ నండూరి శ్రీరామ్మూర్తి గైరబోయిన నాగేశ్వరరావుకే ప్రకాష్ రావు ఎం అంకమ్మరావు కట్టె పోగు నాగేశ్వరరావు మేరీ డి విజయభాస్కర్ రెడ్డి బర్నబాస్
భాస్కర రావు బి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు




