Home South Zone Andhra Pradesh కర్నూలులో దొంగతనాలు !! రెచ్చిపోతున్న దొంగలు

కర్నూలులో దొంగతనాలు !! రెచ్చిపోతున్న దొంగలు

0
0

కర్నూలు సిటీ :
కర్నూలు నగరంలోని ప్రజా నగర్ కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. ఒకే రోజూ రాత్రి మూడు ఇళ్లలో చోరీకీ పాల్పడ్డారు. ఆదివారం రాత్రి పి. గఫూర్ అనే వ్యక్తి ఇంట్లో రూ.50 వేల నగదు, 10 తులాల వెండి, కొంత బంగారం ఎత్తుకెళ్లారు.

అదేవిధంగా ఎస్. ఫరూక్ అనే వ్యక్తి ఇంట్లో రూ.10 వేల నగదు, 10 తులాల వెండి దోచుకెళ్లారు.

ఎస్. సత్తార్ వలి ఇంట్లో 2 తులాల బంగారు, 8 తులాల వెండి చోరీ చేశారు. ఆ ముగ్గురు వివిధ కారణాలతో వేరే ప్రాంతాలకు వెళ్లడంతో దొంగలు అదనుచూసి చోరీకీ పాల్పడ్డారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

NO COMMENTS