కర్నూలు :
కర్నూలు నగరంలోని పెద్దపాడు రోడ్డు లో గల శ్రీ భీరలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో కురువ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 క్యాలెండర్ ఆవిష్కరణ మరియు నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన కురువలకు సన్మాన కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారు పాల్గొన్నారు… కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన కురువలను సన్మానించిన ఎంపీ నాగరాజు గారు, అనంతరం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు…
ఈ సందర్బంగా ఎంపీ గారు మాట్లాడుతూ కురువలు అన్ని రంగాలలో రాణించాలని పిలుపునిచ్చారు.. కురువలు రాజకీయంగా చైతన్యం చెందాలని, రాజకీయంగా ఎదిగినప్పుడే గుర్తింపు వస్తుందన్నారు… రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కురువలు అన్ని స్థానాల్లో పోటీ చేయాలన్నారు.
. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో ఎంపీ టికెట్ తో పాటు ఒక ఎమ్మెల్యేటికెట్ సాధించుకోవాలన్నారు…ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్లు పర్ల శ్రీనివాసులు గారు , రామకృష్ణ గారు,ఉమ్మడి కర్నూలు జిల్లా గొర్రెల పెంపకదారుల సహకార సంఘం చైర్మన్ శ్రీనివాసులు గారు , దిశా కమిటీ మెంబెర్ దేవ శంకర్ గారు, మరియు కురువ సంఘం నాయకులు పాల్గొన్నారు..




