Tuesday, December 30, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshకొండల అమ్మవారి దీవెనలతో ప్రజలకు శుభాకాంక్షలు |

కొండల అమ్మవారి దీవెనలతో ప్రజలకు శుభాకాంక్షలు |

శ్రీ కొండాలమ్మవారి దీవెనలతో ప్రజలందరికీ శుభాలు కలగాలి: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*

శ్రీ కొండలమ్మ అమ్మవారి 2026 నూతన సంవత్సర క్యాలెండర్లు ఆవిష్కరించిన….ఎమ్మెల్యే రాము*

గుడివాడ డిసెంబర్ 30: శ్రీ కొండలమ్మ వారి కరుణాకటాక్షాలతో కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు కలగాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు.

ప్రసిద్ధిగాంచిన గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలోని శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థాన 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను గుడివాడ ప్రజా వేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మంగళవారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము , కూటమి నాయకులకు వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించి అమ్మవారి కంకణాలు కట్టి ప్రసాదం అందించారు.

అమ్మవారి ఆశీస్సులతో గడిచిన ఏడాది కాలంలో గుడివాడ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామని ఎమ్మెల్యే రాము అన్నారు. కొత్త సంవత్సరంలో కూడా గుడివాడ అభివృద్ధి పనులు అమ్మవారి దీవెనలతో దిగ్విజయంగా జరగాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర రావు, శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానం కమిటీ చైర్మన్ ఈడే మోహన్, ఆలయ ఈ.వో ఆకుల కొండలరావు, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్,టిడిపి నాయకులు చేకూరు జగన్మోహన్రావు,పండ్రాజు సాంబశివరావు,మల్లిపెద్ది సుబ్రహ్మణ్యం, రామిదేని వేణు, పెద్దూ వీరభద్రరావు, యార్లగడ్డ సుధారాణి, సింగవరపు ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments