Home South Zone Andhra Pradesh గుంటూరు ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ వెలుగూరి ప్రమాణ స్వీకారం |

గుంటూరు ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ వెలుగూరి ప్రమాణ స్వీకారం |

0
1

గీతా మందిరంలో పాత కమిటీకే మళ్ళీ చోటు.
*అభయశ్రీకే ఆర్యవైశ్య మహాసభ ఓటు* *ఛైర్మన్‌గా వెలుగూరి ప్రమాణస్వీకారం* *త్వరలో నూతన కళ్యాణ మండపం నిర్మిస్తామన్న రత్నప్రసాద్* గీతా మందిరం అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు రెండో పర్యాయం ఛైర్మన్‌గా నియమితులైన వెలుగూరి అభయశ్రీ రత్నప్రసాద్ ప్రకటించారు. ఇప్పటికే ఎంతో చేశామని.. ఇంకా చేయాల్సింది చాలా ఉందని.

. ఇకపై మరింతగా ఆధునీకరించి యావత్ ఆర్యవైశ్య సమాజానికి పూర్తి ఉపయుక్తంగా మలచాలన్నదే తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. గుంటూరు శ్రీ కన్యకా పరమేశ్వరి ధర్మ సత్ర సంఘమైన గీతా మందిరానికి ప్రస్తుతం పాలకవర్గంగా వ్యవహరిస్తున్న కమిటీ కాలపరిమితిని ఆర్యవైశ్య మహాసభ తిరిగి మరో మూడేళ్లు పాటు పొడిగించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ మేరకు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ అధికారికంగా నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో ముక్కోటి దేవతలంతా ఒక్కటై శ్రీ మహా విష్ణువును సేవించి తరించేందుకు తరలి వచ్చే పవిత్ర వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున మళ్ళీ గీతా మందిరం ఛైర్మన్‌గా వెలుగూరి అభయశ్రీ రత్నప్రసాద్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఆర్ అగ్రహారంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం వెనుక వైపు ఉన్న గీతామందిరంలో మంగళకరమైన మంగళవారం ఆర్యవైశ్య మహాసభ గుంటూరు అర్బన్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ రవీంద్ర కుమార్ స్వయంగా ఛైర్మన్ రత్నప్రసాద్‌, ధర్మకర్తల మండలి సభ్యులుగా టి శ్రీనివాస బాబు, ఎంవిఎస్‌ఎస్ఎస్ రమేష్, కెజెఎస్ఎస్ ప్రతాప్, టీఎమ్ రవి కుమార్, బి.బాపారావు, ఎం.గౌరీ శంకర్, ఎన్. హరీష్, జి.శ్రీమాన్, కె. వెంకటేశ్వరరావు, ఐ.ప్రమీలారాణి, ఎ. వసుంధర తదితరులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ గుంటూరు అర్బన్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ, గీతా మందిరానికి దేవాదాయ శాఖ స్వయం ప్రతిపత్తి కల్పించిందని గుర్తు చేశారు. దాని ప్రకారం ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలోనే గీతా మందిరం కమిటీ నియామకం కొనసాగుతుందని ఆయన వివరించారు.

దానికి అనుగుణంగానే అన్ని నియమ నిబంధనలకు లోబడి తమ రాష్ట్ర అధ్యక్షుడు పాత కమిటీనే యథాతథంగా తిరిగి కొనసాగించాలని నిర్ణయించి నియామకపు ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. ఆయన ఆదేశాల ప్రకారమే తాను ప్రత్యేకంగా హాజరై స్వయంగా ప్రమాణస్వీకారం చేయించినట్లు ఆయన వెల్లడించారు.

చైర్మన్ వెలుగూరి అభయశ్రీ రత్నప్రసాద్ మాట్లాడుతూ, ప్రతిష్టాత్మక గీతా మందిరం అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం తన పూర్వ జన్మ సుకృతమని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో మరోమారు ఛైర్మన్‌గా నియమించిన ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని రామ సత్యనారాయణ, అందుకు సహకరించిన గుంటూరు అర్బన్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ రవీంద్ర కుమార్, ఆర్యవైశ్య ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు.

గీతా మందిరం అభివృద్ధిలో భాగంగా త్వరలోనే నూతన కళ్యాణ మండపాన్ని తమ సొంత నిధులతో నిర్మిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆర్యవైశ్యుల ఆకాంక్షలకు అనుగుణంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య ప్రముఖులు, లింగమల్లి రమేష్ఇ.

మిడిశెట్టి సత్యనారాయణ, పబ్బిశెట్టి లక్ష్మీనారాయణ, సిహెచ్.వి.చక్రపాణి, తిరువీదుల శేఖర్, రంగన్న శ్రీను, తాడేపల్లి శివకుమార్ తదితరులు హాజరై ఛైర్మన్ రత్నప్రసాద్‌‌తో పాటు పాలకమండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పలు ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు హాజరై శాలువాలతో సత్కరించారు.

NO COMMENTS