విజయవాడ నగరపాలక సంస్థ
వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించండి
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం అన్నారు.
సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఫార్చ్యూన్ మురళి పార్క్ రోడ్, మదర్ తెరిసా జంక్షన్, పినమనేనిపాలీ క్లినిక్ రోడ్, టిక్కెల్ రోడ్, జమ్మిచెట్టు సెంటర్, సాంబమూర్తి రోడ్ మ్యూజియం రోడ్డు, అజిత్ సింగ్ నగర్, ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎక్కడైనా వ్యర్ధాలు ఉన్నచో శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగించాలని ఇంటింటి వ్యర్థల సేకరణ ఖచ్చితంగా జరగాలని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అజిత్ సింగ్ నగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ లోకి పంపాలని అన్నారు. అక్కడ నుండి జిందాల్ ప్లాంట్ కు ఎప్పడికప్పుడు చేరేడట్టు అధికారులు చూసుకోవాలని ఆదేశించారు.
పౌర సంబంధాలు అధికారి*
విజయవాడ నగరపాలక సంస్థ*
