Home South Zone Andhra Pradesh అన్నా క్యాంటీన్ల పరిశీలన కమిషనర్ ధ్యానచంద్ర |

అన్నా క్యాంటీన్ల పరిశీలన కమిషనర్ ధ్యానచంద్ర |

0

విజయవాడ నగరపాలక సంస
అన్న క్యాంటీన్లో ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా చూసుకోండి*
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు*

అన్న క్యాంటీన్ లోకి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం అజిత్ సింగ్ నగర్ వద్ద గల అన్న క్యాంటీన్ ను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అక్కడున్న ప్రజలతో స్వయంగా తానే మాట్లాడి ఆహార నాణ్యత, అన్న క్యాంటీన్లో ఉన్న వసతుల పై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అన్నా క్యాంటీన్లో భోజనం చేసే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కావాల్సిన ఏర్పాటులు చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ఆహార నాణ్యత, ఇచ్చే టోకెన్లు, వసతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ ప్రభుదాస్, శానిటరీ సూపర్వైసర్ శివరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version