మన శంకర్ వరప్రసాద్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడకి వచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి…
ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న అనిల్ రావిపూడి..
అనిల్ రావిపూడి కామెంట్స్.
జనవరి 12వ తేదీన మన శంకర్ వరప్రసాద్ ప్రేక్షకుల ముందుకు రానుంది..
మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉంది..
ఒక డైరెక్టర్ గా మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తీయడం నా అదృష్టంగా భావిస్తున్నాను…
8 సినిమాల్లో 3 సినిమాలు సంక్రాంతి కి వచ్చాయి
మెగా స్టార్ తో తీసిన చిత్రం సంక్రాంతికి రాబోతుంది…
చిరంజీవిలోని అద్భుత కామెడీ నీ బయటకు తీశాం…
మెగాస్టార్ చిరంజీవి అద్భుత డ్యాన్స్, హ్యాండ్ సమ్ లుక్ తో కనిపిస్తారు..
ఈ చిత్రం కోసం ఫిట్నెస్ గా అందంగా కనపడడానికి చిరంజీవి గారు చాలా కష్టపడ్డారు
నయన తార ,శశిరేఖా పాత్రలో జీవించారు.
చిత్రం లాస్ట్ 13 మినిట్స్ విక్టరీ వెంకటేష్ గారు ఇరగదీస్తారు..
గుంటూరు లో విజ్ఞాన యూనివర్సిటీ లో చిరంజీవి వెంకటేష్ కలిపి చిత్రీకరించిన పాట విడుదల చేస్తున్నాం..
సంక్రాంతికి హిట్ కొట్టబోతున్నాం..
మెగాస్టార్ చిరంజీవి ఒరిజినల్ పేరు నా చిత్రానికి టైటిల్ గా పెట్టడం చాలా సంతోషం
వినోదాత్మక, మంచి మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం
ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలనేదే నా లక్ష్యం
చిరంజీవి,వెంకటేష్ డ్యాన్స్ స్క్రీన్ పై కనువిందు చేస్తుంది
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజసాబ్ చిత్రం కోసం కూడా ఎదురు చూస్తున్నాం
ఆ సినిమా కూడా హిట్ కొట్టాలి
నయనతార తో న్యూ ఇయర్ రోజున సర్ప్రైజ్ ఉంది
మీసాల పిల్ల పాట వంద మిలియన్లు కు చేరింది
శశిరేఖా పాట కూడా 30 మిలియన్స్ కు చేరుకుంది
ట్రైలర్ కూడా త్వరలో రిలీజ్ చేస్తాం
సినిమాను ప్రేక్షకులు విజయవంతం చేస్తారని ఆశిస్తున్నా..
ట్రోలింగ్ లు సాధారణం అయ్యాయి వాటి గురించి నేను కామెంట్ చేయను…
భగవంతు కేసరి తరహాలో మరో డ్రామా చిత్రం నిర్మించాలని ఉంది
టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం..
చిత్ర ఇండస్ట్రీలో నాలుగు పిల్లర్స్ ఉన్నాయి. చిరంజీవి ,బాలకృష్ణ ,వెంకటేష్ ,నాగార్జున..
వారిలో ముగ్గురితో చిత్రాలు నిర్మించాను..
నాగార్జునతో హలో బ్రదర్ లాంటి చిత్రం చేయాలని ఉంది..
బీమ్స్ మ్యూజిక్ అల్టిమేట్ గా ఉంది..
మ్యూజికల్ వినోదం యాక్షన్ సన్నివేశాలు అన్ని ఈ చిత్రంలో ఉంటాయి….
సీనియర్స్ తర్వాతే మేము అని ప్రభాస్ అనడం ప్రభాస్ వ్యక్తిత్వానికి నిదర్శనం..
ప్రభాస్ నటించిన రాజా సాబ్ చిత్రం 8 వ తేదీన చూస్తాం…
ఎప్పుడు ప్రమోషన్స్ చేయని నయనతార నాతో కలిపి ప్రమోషన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది






