Tuesday, December 30, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ నమోదు |

ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ నమోదు |

తాడేపల్లి

ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ని 9 నుంచి 15 సంవత్సరాల లోపు బాలికలు సద్వినియోగం చేసుకోండి: డాక్టర్ సుధా

డిసెంబర్ 31 సాయంత్రం లోపు నమోదు చేసుకొండి: రామకృష్ణ, వివేకానంద రెడ్డి.

రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ శక్తి అనే పేరుతో 9 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల లోపు ఉన్న బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నిరోధక వ్యాక్సిన్ ను పూర్తిగా ఉచితంగా అందించడం జరుగుతోందని రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షులు శెట్టి రామకృష్ణ,ఫాస్ట్ ప్రెసిడెంట్ మున్నంగి వివేకానంద రెడ్డి అన్నారు.మంగళవారం తాడేపల్లి

కె.వి.ఆర్.జడ్.హై స్కూల్, సీతానగరం,రామకృష్ణ మిషన్ హై స్కూల్, మహానాడు నేతాజీ స్కూల్,
చిర్రావూరు ప్రభుత్వ పాఠశాలలో బాలికలకు (విద్యార్థులకు) డాక్టర్ సుధా,డాక్టర్ స్వాతి చందన,డాక్టర్
కూచిపూడి మనోజ్ఞ,అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్

తాడేపల్లి ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ శక్తి పేరుతో అందిస్తున్న ఈ ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ను తల్లిదండ్రుల అనుమతితో 9 నుంచి 15 సంవత్సరాలలోపు ప్రతి బాలిక సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అన్నారు. రోటరీ ప్రతినిధులు మాట్లాడుతూ ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ను పేరు నమోదుచేయించుకునేందుకు డిసెంబర్ 31వ తేదీలోపు సంప్రదించాలని కోరారు. వివరాలకు కోసం ఈ క్రింది నంబర్స్ ని 9948074365,9703934444,

9032331199,8466812222, సంప్రదించవచ్చు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అఫ్ తాడేపల్లి ప్రతి నిధులు పలగాని శ్రీకాంత్,జొన్న రాజేష్,కాట్రగడ్డ
శివన్నారాయణ,రమేష్,శెట్టి
కేశవరావు,సూర్యనారాయణ,
స్కూలు ఉపాధ్యాయులు ప్రసాద్, వీరాంజనేయులు,సుజాత,శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments