Tuesday, December 30, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఉద్యోగుల ఇళ్ల స్థలాల అంశం సీఎం దృష్టికి |

ఉద్యోగుల ఇళ్ల స్థలాల అంశం సీఎం దృష్టికి |

కొత్త ఏడాదిలో నూత‌నుత్తేజంతో ప‌నిచేద్దాం*
– *స‌మ‌ష్టి భాగ‌స్వామ్యంతో రాష్ట్రాభివృద్ధిలో భాగ‌స్వాములుకండి*
– *ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై పూర్తి స్ప‌ష్ట‌త ఉంది*
– *ఎపీ ఎన్‌జీజీవో నేత‌ల‌తో, APJAC నేతలతో గౌర‌వ ముఖ్య‌మంత్రి*

కొత్త ఏడాదిలో మ‌రింత ఉత్సాహంతో నూత‌నుత్తేజంతో స్వ‌ర్ణాంధ్ర సాధ‌న దిశ‌గా ప‌నిచేద్దామ‌ని.. స‌మ‌ష్టి భాగ‌స్వామ్యంతో రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులు భాగ‌స్వాములు కావాల‌ని గౌర‌వ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుగారు ఏపీ ఎన్‌జీజీవో, ఏపీ జేఏసీ నేత‌ల‌తో అన్నారు.

సోమ‌వారం ఏపీ ఎన్‌జీజీవో, ఏపీ జేఏసీ నేత‌లు గౌర‌వ ముఖ్య‌మంత్రిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి సంఘ నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో సంఘ క్యాలెండ‌ర్‌ను, డైరీ..2026 ను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. జేఏసీ నేతలు అందరి ముందు ఎన్జీవో సంఘ నాయకుల ముందు డైరీను, క్యాలెండర్ను ఆవిష్కరించిన గౌర‌వ ముఖ్య‌మంత్రివ‌ర్యులు మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.

ఉద్యోగుల సమస్యలపై పూర్తి అవగాహనతో పాటు స్పష్టమైన దృష్టి ఉందని, దశలవారీగా అన్ని అంశాలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తూనే ఉద్యోగుల హక్కులను కాపాడే దిశగా నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేస్తూ రాష్ట్రాభివృద్ధిని వేగవంతం చేయ‌డంలో ప్ర‌భుత్వ ఉద్యోగుల పాత్ర కీల‌క‌మ‌ని పేర్కొన్నారు. రాష్ట్ర స‌మ‌గ్రాభివృద్ధికి ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌ణాళికాయుత‌మైన కృషికి ఉద్యోగ సంఘాల చొర‌వను జ‌త‌చేయ‌డం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని తెలిపారు.

ఏపీ ఎన్‌జీజీవోస్ అధ్య‌క్షులు ఎ.విద్యాసాగ‌ర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో ఎన్‌జీజీవోస్‌, ఏపీ జేఏసీ కీల‌క‌భాగస్వామ్యం అవుతుంద‌ని.. గౌర‌వ ముఖ్య‌మంత్రి సార‌థ్యంలో రాష్ట్రం శ‌ర‌వేగంగా అభివృద్ది చెందాల‌ని ఆకాంక్షిస్తున్నామ‌ని, ఉద్యోగుల సమస్యలు, ఆకాంక్ష‌లు కూడా నూతన సంవత్సరంలో నెర‌వేరుతాయ‌ని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జోగులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ముఖ్యమంత్రి దగ్గర ఏపీ జెఎసి చైర్మన్ విద్యాసాగర్ ప్రస్తావించారు.

*HOD మరియు సెక్రెటరీ ఉద్యోగులకు రాజధానిలో ఇళ్ల స్థలాల అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి ప్రత్యేకంగా తీసుకుని వచ్చిన ఏపీ ఎన్జీజివో నేతలు ఏ విద్యాసాగర్, డివి రమణ*

*గౌరవ ముఖ్యమంత్రి గారికి మహిళా ఎన్జీజివో నేతల ధన్యవాదాలు*

ఉద్యోగ సంఘాల సమావేశంలో హామీ ఇచ్చిన విధముగానే మహిళా ఉద్యోగుల చైల్డ్ కేరి లీవు సంబంధించిన వయోపరిమితిని తొలగించినందుకు ఏపీ ఎన్జీ జీవో మహిళా నేతలు శ్రీ రాజ్యలక్ష్మి శ్రీ జానకి శ్రీ సురేఖ తదితరులు ముఖ్యమంత్రి గారికి రెండు లక్షల మంది మహిళా ఉద్యోగులు తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు అందరి తరపున ముఖ్యమంత్రి గారికి ఒక జ్ఞాపికను అందజేశారు.

*RTC ఉద్యోగులకు ప్రమోషన్లు*

ఉద్యోగ సంఘాలతో సమావేశం అయినప్పుడు ఇచ్చిన మిగతా హామీలతో పాటు ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్ హామీపై కూడా వెలువంటేనే ఉత్తర్వులు వెలువరించిన సందర్భంగా ఏపీ జెఎసి చైర్మన్ విద్యాసాగర్, ఏపీఎస్ఆర్టీసీ NMU నేతలు శ్రీ వై శ్రీనివాస్, శ్రీ రాజు గారు గౌరవ ముఖ్యమంత్రి ఈ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

*రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల నేతలు*

ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ల సంఘం నాయకులు శ్రీ బీ వెంకటేశ్వర్లు శ్రీ ప్రభుదాసు రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారిని కలిసి పెన్షనర్లకు సంబంధించిన ఎడిషన్ క్వాంటమును 2018లో తెలుగుదేశం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇవ్వటం జరిగిందని, దానిని గత ప్రభుత్వం కోత విధించిందని, మరల ఎడిషనల్ క్వాంటం పెన్షన్ పునరుద్యోగించాల్సిన అవసరం ఉన్నదన్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో కలిసిన రాష్ట్రంలోని ప్రముఖ ఉపాధ్యాయ సంఘాలు, APSRTC NMU సంఘ, పెన్షనర్స్ సంఘ డైరీలోను క్యాలెండర్ను ఆవిష్కరించారు.

గౌర‌వ ముఖ్య‌మంత్రిని క‌లిసిన వారిలో ఏపీ ఎన్‌జీజీవో జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ డీవీ ర‌మ‌ణ‌, ఏపీ యూటీఎఫ్ ప్రెసిడెంట్ న‌క్కా వెంక‌టేశ్వ‌ర్లు, ఏపీ ఎస్‌టీయూ ప్రెసిడెంట్ ఎం.ర‌ఘునాథ‌రెడ్డి, ఏపీ టీచ‌ర్స్ ఫెడ‌రేష‌న్ (257) ప్రెసిడెంట్ జి.హృద‌య‌రాజు, ఏపీ టీచ‌ర్స్ ఫెడ‌రేష‌న్ (1938) ప్రెసిడెంట్ సీహెచ్ మంజుల‌, ఏపీపీటీడీ (ఎన్ఎంయూ

అసోసియేష‌న్‌) ప్రెసిడెంట్ వై.శ్రీనివాస్‌, ఏపీ పెన్ష‌న‌ర్స్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ డి.వెంక‌టేశ్వ‌ర్లు, ఏపీ సీపీఎస్ ప్రెసిడెంట్ కె.స‌తీష్‌, ఏపీ గ్రామ వార్డు సచివాల‌యం ప్రెసిడెంట్ జానీ పాషా, ఏపీపీఏవో అసోసియేష‌న్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ హ‌ర‌నాథ్‌, ఏపీ ఇరిగేష‌న్ ఎన్‌జీవోస్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ సీహెచ్ శ్రీనివాస‌రావు, ఏపీ క్లాస్ 4 అసోసియేష‌న్ ప్రెసిడెంట్ ఎన్‌.చంద్ర‌శేఖ‌ర్, ఏపీ వెట‌ర్న‌రీ ఫెడ‌రేష‌న్ బి.సేవా నాయ‌క్‌, ఏపీ ఏఈవోఎస్ ప్రెసిడెంట్ వేణుమాధ‌వ్‌, ఏపీ ట్రెజ‌రీ స‌ర్వీసెస్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ పి.శ్రీనివాస్‌, ఏపీఆర్ఎస్‌వో ప్రెసిడెంట్ శ్రీనివాస్ త‌దిత‌రులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments