Tuesday, December 30, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshకేఎల్ యూనివర్సిటీలో ఎస్పీ సంకల్పం కార్యక్రమం |

కేఎల్ యూనివర్సిటీలో ఎస్పీ సంకల్పం కార్యక్రమం |

గుంటూరు  జిల్లా పోలీస్.

డ్రగ్స్ బారినుండి విద్యార్థులను కాపాడటమే లక్ష్యంగా “సంకల్పం (Sankalpam)” కార్యక్రమం నిర్వహిస్తున్నాం. – గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు,.//*_ 🚩 తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఎల్ యూనివర్సిటీ కాన్ఫరెన్స్ హాల్లో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు *“సంకల్పం – మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం.

అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. 📍*ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. డ్రగ్స్ ఉచ్చులో యువత ఎలా చిక్కుకుంటున్నారో, వాటి వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక, న్యాయపరమైన నష్టాలపై విస్తృతంగా వివరించారు.

ఈ సందర్భంగా గౌరవ ఎస్పీ గారు మాట్లాడుతూ…*
కేఎల్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో విద్యార్థులతో మమేకమవడం సంతోషకరమన్నారు. ఇక్కడ చదవడం అదృష్టమని, ప్రతి ఒక్కరికీ ఈ అవకాశం దక్కదని, ఇక్కడి విద్య జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లే శక్తి కలిగి ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుతం డ్రగ్స్ సమస్య యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందని, ఇది రాష్ట్రానికే కాక దేశవ్యాప్తంగా ఎదురవుతున్న పెద్ద సవాలుగా మారిందన్నారు. ముఖ్యంగా కాలేజీ వయస్సులోనే చాలా మంది డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

గతంలో డ్రగ్స్ వినియోగం మెట్రో నగరాలకే పరిమితమై ఉండేదని, కానీ ఇప్పుడు గ్రామాలు, పాఠశాలల వరకు విస్తరించడం అత్యంత ప్రమాదకర పరిణామమన్నారు.అందుకే వివిధ స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థల్లో *సంకల్పం* కార్యక్రమం ద్వారా విద్యార్థులకు డ్రగ్స్ గురించి విస్తృత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

డ్రగ్స్‌కు అలవాటు పడితే అవి శారీరకంగా, మానసికంగా వ్యక్తిని పూర్తిగా బలహీనపరుస్తాయని, చివరకు నేరాల వైపు నడిపిస్తాయని హెచ్చరించారు. డ్రగ్స్ కలిగి ఉండటం, వినియోగించడం, అమ్మడం, సరఫరా చేయడం అన్నీ NDPS చట్టం కింద తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారని తెలిపారు.

డ్రగ్స్ కేసుల్లో బెయిల్ లభించకపోవడం, 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉండటం, క్రిమినల్ హిస్టరీ ఏర్పడటం వల్ల భవిష్యత్తులో ఉద్యోగాలు, పాస్‌పోర్ట్, విదేశీ అవకాశాలు అన్నీ దెబ్బతింటాయని స్పష్టం చేశారు.

చిన్న అలవాటు అనుకుని మొదలుపెట్టిన డ్రగ్స్ చివరకు జీవితాన్ని నాశనం చేస్తాయని, ప్రతి విద్యార్థికి ఉజ్వల భవిష్యత్తు ఉన్నందున ఇటువంటి ప్రమాదకర అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.

గుంటూరు జిల్లాలో గడిచిన మూడు నెలల్లో సుమారు 200 మందిని డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగిందని, సరఫరాదారులతో పాటు వినియోగదారులపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

డ్రగ్స్‌కు అలవాటు పడిన విద్యార్థులను భవిష్యత్తు దృష్ట్యా ముందుగా కౌన్సిలింగ్ నిర్వహించి, తల్లిదండ్రుల సమక్షంలో అవగాహన కల్పించి పునరావాసం కల్పిస్తున్నామని తెలిపారు. అయితే సమస్య తీవ్రత దృష్ట్యా అవసరమైతే వినియోగదారులపై కూడా కేసులు నమోదు చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు.

డ్రగ్స్ సమాచారాన్ని తెలియజేసేందుకు కళాశాలలో డ్రాప్ బాక్స్ ఏర్పాటు చేస్తున్నామని, అందులో ఇచ్చే సమాచారాన్ని పూర్తిగా గోప్యంగా ఉంచి పోలీస్ శాఖ మాత్రమే చర్యలు తీసుకుంటుందని తెలిపారు. డ్రగ్స్ బారిన పడినవారిని అడిక్షన్ సెంటర్ల ద్వారా చికిత్స అందించి సాధారణ జీవనంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

*“Be Smart, Don’t Start” అనే నినాదంతో విద్యార్థులను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ సందర్భంగా కేఎల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ బి. పార్థసారథి వర్మ గారు మాట్లాడుతూ,* ఈ వయస్సులో వచ్చే తప్పుడు ఆకర్షణలు జీవితాన్ని నాశనం చేస్తాయని, తల్లిదండ్రులు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు.

*“సంకల్పం”* వంటి కార్యక్రమాన్ని ప్రారంభించిన గుంటూరు జిల్లా ఎస్పీ గారిని హృదయపూర్వకంగా అభినందించారు. జిల్లా అదనపు ఎస్పీ (ఏఆర్) శ్రీ ఏ. హనుమంతు గారు డ్రగ్స్ వల్ల మనిషిలో వచ్చే మార్పులు, సమాజంపై దుష్ప్రభావాలను చూపే వీడియోల ద్వారా విద్యార్థులకు వివరించారు

ఈ కార్యక్రమంలో కేఎల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ శ్రీ కె. సుబ్బారావు గారు, జిల్లా అదనపు ఎస్పీలు శ్రీ జివి రమణమూర్తి గారు (అడ్మిన్), శ్రీ ఏటీవీ రవికుమార్ గారు (L&O), శ్రీ హనుమంతు గారు (ఏఆర్), ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసులు గారు, ఎస్బీ సీఐలు శ్రీ అలహరి శ్రీనివాస్ గారు, శ్రీ రాంబాబు గారు, ఐటి కోర్ సీఐ నిస్సార్ బాషా గారు, తాడేపల్లి సీఐ శ్రీ వీరేంద్రబాబు గారు, ఎస్సై కాజావలి గారు, ఇతర పోలీస్ అధికారులు, కళాశాల యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments