ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ .ఎం .ఎ)ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ఇచ్చే ఉత్తమ రాష్ట్ర అధ్యక్షుని అవార్డు 2024 -2025 సంవత్సరముకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన డాక్టర్ గార్లపాటి నందకిషోర్ కు లభించింది. ఈ అవార్డును గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించిన ఐ.ఎం.ఏ జాతీయ సదస్సు లో ఏర్పాటుచేసిన అవార్డుల ప్రదా నోత్సవ కార్యక్రమంలో..
. గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ శంకర్ చౌదరి, రాజ్యసభ సభ్యులు మాన్య నాయక్, ఐ.ఎం.ఏ జాతీయఅధ్యక్షులు డాక్టర్ దిలీప్ బన్సాలి ,జాతీయ కార్యదర్శి సర్బరీ దత్త తదితరులసమక్షంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జైయ్ షా
చేతుల మీదగా డాక్టర్ నందకిషోర్ అందుకున్నారు. 2024 -2025 సంవత్సరంలో అధ్యక్షునిగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి వైద్యులను అనేక సమాజ హిత విషయాలలో చైతన్య పరిచినందుకు , వైద్యుల, ప్రజారోగ్య సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేసినందుకు గాను ఈ అవార్డు లభించిందన్న విషయం తెలిసిందే. డాక్టర్ నందకిషోర్
అవార్డు ప్రధానో త్సవ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖకు చెందిన ఐ.ఎం.ఏ పూర్వ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి. సమరం ,రాష్ట్రపూర్వ అధ్యక్షులు డాక్టర్ నాగళ్ళ కిషోర్, డాక్టర్ సి.హెచ్. శ్రీనివాసరాజు, ప్రస్తుతఅధ్యక్షులు డాక్టర్ ఎస్. బాలరాజు, ఏ.పీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి. శ్రీహరి రావు ,ఐఎంఏ పూర్వ కార్యదర్శి
డాక్టర్ పి. ఫణిదర్ ఐ.ఎం.ఏ గుంటూరు శాఖ అధ్యక్షులు డాక్టర్ టి. సేవకుమార్, ఐఎంఏ సిజిపి రాష్ట్ర కార్యదర్శి కార్యదర్శి డాక్టర్ ఎం .వి.వి.మురళీమోహన్, డాక్టర్ వి. మహేష్, డాక్టర్ డి. భరత్ కుమార్ లతో పాటు దేశవ్యాప్తంగా విచ్చేసిన 2000 మందికి పైగా వైద్యులు పాల్గొన్నారు.






