నరసరావుపేట–గుంటూరు రహదారిపై విషాదం
ఇన్నోవా క్రిష్టా ఢీకొని ఫ్లిప్‌కార్ట్ డెలివరీ బాయ్ మృతి
పల్నాడు జిల్లా: నరసరావుపేట నుంచి గుంటూరు వెళ్లే మార్గమధ్యంలో, పొనుగుపాడు కాలువ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
సూర్యcem” అని రాసి ఉన్న టయోటా ఇన్నోవా క్రిష్టా కారు, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పావులూరు సురేష్ బాబును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు వృత్తిరీత్యా Flipkart డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.
ప్రమాదానికి కారణమైన ఇన్నోవా క్రిష్టా వాహనం పిడుగురాళ్లకు చెందిన ‘సూర్యcem ’ మేనేజింగ్ డైరెక్టర్ కొత్త చిన్న సుబ్బారావుకు సంబంధించినదిగా గుర్తించారు.
ప్రమాద సమయంలో వాహన వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం, రహదారి పరిస్థితులు వంటి అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసు దర్యాప్తులో వెలువడాల్సి ఉంది.
#నరేంద్ర




