Home South Zone Andhra Pradesh నూతన సంవత్సర వేడుకలు శాంతియుతంగా జరపాలి – జిల్లా ఎస్పీ|

నూతన సంవత్సర వేడుకలు శాంతియుతంగా జరపాలి – జిల్లా ఎస్పీ|

0

గుంటూరు జిల్లా పోలీస్…

నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా, బాధ్యతాయుతంగా జరుపుకోవాలి – జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు,.//*_

ప్రజా శాంతి, భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరిక.

రాబోయే నూతన సంవత్సరం–2026 వేడుకలను గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించుకోవాలని గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు విజ్ఞప్తి చేశారు. వేడుకల పేరుతో చట్ట నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజా శాంతి, భద్రతలను పరిరక్షించేందుకు జిల్లా పోలీస్ శాఖ విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేపట్టిందని, ప్రజలు తప్పనిసరిగా పోలీసుల సూచనలు, ఆదేశాలను పాటించాలని ఎస్పీ గారు కోరారు.

ప్రజలకు జిల్లా ఎస్పీ గారి ముఖ్య సూచనలు

డిసెంబరు 31 రాత్రి బహిరంగ ప్రదేశాలు, రహదారులపై నూతన సంవత్సర వేడుకలు నిర్వహించరాదు.

మద్యం సేవించి వాహనాలు నడపడం నేరం. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ నిర్వహించి, పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి జైలుకు తరలిస్తామని, డ్రైవింగ్ లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేసే చర్యలు చేపడతామని హెచ్చరించారు.

అతివేగం, బైక్ రేసింగ్, ప్రమాదకరంగా వాహనాలు నడపడం, సైలెన్సర్లు తొలగించి భారీ శబ్దాలు చేయడం, అనవసరంగా హారన్‌లు మోగించడం వంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తాము.

డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి నిర్ణీత సమయం వరకే ప్రజలు బయట తిరిగేందుకు పోలీస్ శాఖ తరపున అనుమతించడం జరుగుతుంది. ఆ తరువాత నిబంధనలు ఉల్లంఘిస్తూ బయట తిరిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము.

మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు – వయస్సు నిండని పిల్లలకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులు లేదా వాహన యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము.

గుంటూరు జిల్లా వ్యాప్తంగా బందోబస్తు ఏర్పాటు చేయబడింది. ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెట్లు, తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి, రాత్రి గస్తీ మరియు డ్రోన్ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేస్తాము.

బహిరంగ ప్రదేశాల్లో కేక్ కటింగ్, డ్యాన్సులు, బహిరంగ పార్టీలు, రంగులు పూయడం, డీజే / లౌడ్ స్పీకర్లతో శబ్ద కాలుష్యం సృష్టించడం నిషేధం.

బహిరంగ ప్రదేశాలు లేదా రహదారులపై పటాసులు, మందుగుండు సామగ్రి కాల్చితే కఠిన చర్యలు తీసుకుంటాము.

పెద్ద సంఖ్యలో గుమిగూడి ప్రజల స్వేచ్ఛ, శాంతికి భంగం కలిగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము.

మహిళలు, యువతులపై వేధింపులు, ఈవ్ టీజింగ్ వంటి ఘటనలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము.

ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి మాత్రమే మద్యం విక్రయాలు జరగాలి. నిబంధనలు ఉల్లంఘించిన మద్యం షాపులు, బార్లపై కూడా కఠిన చర్యలు ఉంటాయి.

ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహించుకునే వారు తప్పనిసరిగా పోలీస్ శాఖ నుండి ముందస్తు అనుమతులు తీసుకోవాలి. ట్రాఫిక్ నియంత్రణ, సమూహాల నియంత్రణ (Crowd Control) కోసం తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలి. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తాము.

ప్రజలందరూ నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో ఇంటివద్దనే ఆనందంగా జరుపుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడిపి డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో ఇరుక్కొని జైలుకు వెళ్లి కుటుంబ ఆనందానికి దూరం కావద్దని జిల్లా ఎస్పీ గారు హితవు పలికారు.

ఏవైనా అవాంఛనీయ ఘటనలు లేదా ఇబ్బందులు ఎదురైతే వెంటనే డయల్ 112 కు సమాచారం అందించాలని సూచించారు. పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించి బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించాలని కోరారు.

గుంటూరు జిల్లా ప్రజలందరూ నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో, సురక్షిత వాతావరణంలో స్వాగతించాలని జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు ఆకాంక్షించారు.

NO COMMENTS

Exit mobile version