Home South Zone Andhra Pradesh బాపట్లలో రికవరీ చేసిన 373 మొబైళ్లు బాధితులకు అందజేత |

బాపట్లలో రికవరీ చేసిన 373 మొబైళ్లు బాధితులకు అందజేత |

0

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, రికవరీ చేయబడిన సుమారు రూ.74,60,000/- విలువ గల 373 మొబైల్ ఫోన్ లోను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు
బాపట్ల: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను తిరిగి పొందడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న బాధితులు
ప్రస్తుత జీవన విధానంలో మొబైల్ ఫోన్ సమాజంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన వస్తువుగా మారింది
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ల రికవరీ పై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది.

ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గడిచిన మూడు నెలల కాలంలోనే 373 మొబైల్ ఫోన్ లను రికవరీ చేయడం జరిగింది
జిల్లా ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం రూ.7,17,80,000/- విలువ కలిగిన 3301 మొబైల్ ఫోన్ లను రికవరీ చేయడం జరిగింది.
అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని వేగంగా మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన జిల్లా పోలీసులకు అభినందన
జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు.

ఎవరైనా ఎక్కువ విలువ గల మొబైల్ ఫోన్‌ లను తక్కువ ధరకు సెకండ్ హ్యాండ్ రూపంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తే, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి ఫోన్లను కొనవద్దని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర ఐపీఎస్ గారు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ గారు బాధ్యతలు చేపట్టిన నాప్పటి నుండి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి రికవరీ చేయబడిన సుమారు రూ.74,60,000/- విలువ గల 373 మొబైల్ ఫోన్ లోను సోమవారం జిల్లా పోలీస్ క్యాంప్ కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాధితులకు జిల్లా ఎస్పీ గారు స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, ప్రస్తుత మన నిత్య జీవన విధానంలో మొబైల్ ఫోన్ అనేది ఒక భాగంగా మారిందన్నారు. మొబైల్ ఫోన్ పోతే దానిలో ఉన్న సమాచారం కోల్పోవడం జరుగుతుందన్నారు. మొబైల్ ఫోన్ యొక్క ప్రాధాన్యత దృష్టిలో ఉంచుకొని మిస్సింగ్ మొబైల్ ఫోన్లను ట్రేస్ చేయుటకు జిల్లాలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొబైల్ ట్రేసింగ్ ద్వారా గత 3 నెలల కాలంలో రూ.74,60,000/- విలువ గల 373 మొబైల్ ఫోన్ లను రికవరీ చెయ్యడం జరిగిందన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని వేగంగా మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం

రూ.7,17,80,000/- విలువ కలిగిన 3301 మొబైల్ ఫోన్ లను రికవరీ చేయడం జరిగిందన్నారు. ఈ మొబైల్ ఫోన్లను మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా గుర్తించి సంబంధిత బాధితులకు అందజేయడం జరిగిందని తెలిపారు. మొబైల్ ఫోన్ లలో వ్యక్తిగత సమాచారంతో పాటు విలువైన డేటా నిల్వ ఉంచుకుంటున్నారన్నారు.

అందువల్ల మొబైల్ ఫోన్ పోతే తిరిగి ఆ డేటాను రికవరీ చేయడం చాలా కష్టతరంగా ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసేందుకు గత మూడు నెలల కాలంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత 15 రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 253 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందన్నారు. కేవలం మూడు నెలల కాల వ్యవధిలోనే రూ.74,60,000/- విలువ గల 373 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని తెలిపారు.

ప్రజలు తమ మొబైల్ ఫోన్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒకవేళ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే, మొబైల్ యొక్క IMEI నెంబర్లు, దానికి సంబంధించిన బిల్లుతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలన్నారు. లేదా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన CEIR పోర్టల్ లో స్వయంగా ఫిర్యాదు నమోదు చేయవచ్చునన్నారు.
CEIR పోర్టల్ లో పిర్యాదు చేయు విధానం:

1. www.ceir.gov.in అను వెబ్సైట్లోకి వెళ్లి “Lost Mobile” ఆప్షన్ ఎంచుకోవాలి2. పోగొట్టుకున్న మొబైల్ యొక్క IMEI నెంబర్లు, ఫోన్ బిల్లు మరియు గవర్నమెంట్ జారీచేసిన ID ప్రూఫ్ వివరాలు నమోదు చెయ్యాలి.3. మొబైల్ రికవరీ గురించిన సమాచారం పొందేందుకు… వాడుకలో ఉన్న ఫోన్ నెంబర్ తెలపాలి.4. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం వెళ్తుంది. వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని మొబైల్ ఫోన్ ను రికవరీ చేసి బాధితులకు అందించడం జరుగుతుంది.

మొబైల్ ఫోన్ పోతే తీసుకోవలసిన జాగ్రత్తలు: 1.మొబైల్ ఫోన్ పోయిన వెంటనే SIM CARD బ్లాక్ చేయించు కోవడం.2.బ్యాంకు కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ను మార్చుకోవడం.3. అదే నెంబర్ పై నూతన సిమ్ కార్డ్ ను తీసుకోవాలి..4. CEIR పోర్టల్ లో లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి.

ప్రజలు తమ మొబైల్ ఫోన్లు పోకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ గారు పేర్కొన్నారు. ఒకవేళ మీ సెల్ ఫోన్ ఎవరైనా చేతికి చిక్కినట్లయితే, వారు ఆ ఫోన్‌ను ఉపయోగించి నేరాలకు పాల్పడే అవకాశమున్నదని, అందువల్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా ఎక్కువ విలువ గల మొబైల్ ఫోన్‌ లను తక్కువ ధరకు సెకండ్ హ్యాండ్ రూపంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తే, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి ఫోన్లను.

కొనవద్దని సూచించారు. అలాగే ఎవరైనా అనుమానాస్పదంగా మొబైల్ ఫోన్లు అమ్మడానికి వస్తే, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ఒకవేళ సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ కొనాలని భావిస్తే తప్పనిసరిగా సక్రమమైన బిల్లును పరిశీలించిన తర్వాత మాత్రమే కొనాలని సూచించారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో దొరికిన మొబైల్‌ ఫోన్లను తీసుకుని వాడడం చేయరాదని, వాటిని స్థానికంగా పోలీసు స్టేషన్లలో అప్పగించాలని కోరారు.

అధునాతన సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగించుకొని మూడు నెలలు కాలంలోనే రూ.74,60,000/- విలువ గల 373 మొబైల్ ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అందించడంలో విశేషాలు కృషి చేసిన ప్రత్యేక బృందాన్ని, జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని జిల్లా ఎస్పీ గారు అభినందించారు.

#నరేంద్ర

NO COMMENTS

Exit mobile version