మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బాచుపల్లి పరిధిలోని బైరం చెరువు (పెద్ద చెరువు) ఆధునీకరణ, సుందరీకరణ పనులను హెచ్ఎండిఏ ద్వారా వేగవంతం చేయాలని, చెరువు కట్ట పటిష్టతకు తక్షణ చర్యలు చేపట్టాలని మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు డిమాండ్ చేశారు.
సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఆమె అధికారులకు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత వర్షాకాలంలో బైరం చెరువు కట్ట తెగిపోవడంతో పరిసర ప్రాంతాల్లోని ఇళ్లు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. అప్పట్లో తృటిలో ప్రాణ, ఆస్తి నష్టం తప్పిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ముందుస్తు చర్యలు చేపట్టాలని కోరారు.
బంద్ నిర్మాణం, స్టోన్ పిచ్చింగ్, రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ వేసవిలోనే యుద్ధ ప్రాతిపదికన చెరువు చుట్టూ పటిష్టమైన బంద్ నిర్మించాలని, దానికి స్టోన్ పిచ్చింగ్ (రాళ్లతో పేర్చడం) ద్వారా రక్షణ కల్పించాలని సూచించారు. చెరువు యొక్క ఇన్-లెట్స్ (నీరు వచ్చే దారులు) అవుట్-లెట్స్ (నీరు వెళ్లే దారులు)ను ఎస్.ఎన్.డి.పి నాళాలకు అనుసంధానం చేయాలని కోరారు.
తద్వారా అదనపు నీరు నివాస ప్రాంతాల మీదకు రాకుండా నేరుగా నాళాల ద్వారా వెళ్లే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా నాయకులు దాసి నాగరాజ, బీజేపీ జిల్లా నాయకులు రచ్చ చక్రధర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ప్రజల భద్రత దృష్ట్యా ప్రభుత్వం, హెచ్ఎండిఏ అధికారులు ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
#sidhumaroju




