Tuesday, December 30, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshసరూర్ ఏ ఉర్దూ మహోత్సవానికి ఎంపీ కేసినేని శివనాథ్ |

సరూర్ ఏ ఉర్దూ మహోత్సవానికి ఎంపీ కేసినేని శివనాథ్ |

ఉర్దూ భాష‌ను వృద్ధిలోకి తీసువ‌చ్చింది సీఎం చంద్ర‌బాబు ఒక్క‌డే :ఎంపీ కేశినేని శివ‌నాథ్
స‌రూర్-ఎ.ఉర్దూ మ‌హోత్స‌వ్ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా హాజ‌రు

విజ‌య‌వాడ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఉర్దూ భాష‌ను వృద్దిలోకి తీసుకువ‌చ్చిన‌ ఒకే ఒక్క నాయ‌కుడు సీఎం చంద్ర‌బాబు నాయుడు అని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ స్ప‌ష్టం చేశారు. త‌మ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రంలో మంగ‌ళ‌వారం జ‌రిగిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ స్వ‌ర్ణ‌త్సోవ వేడుక‌ల్లో ఎంపీ కేశినేని శివ‌నాథ్ పాల్గొన్నారు.

ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ కు ఉర్దూ అకాడ‌మీ చైర్మ‌న్ గా ముహ‌మ్మ‌ద్ ఫారూక్ షిబ్లీ స్వాగ‌తం ప‌లికారు. ఈకార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర న్యాయ,మైనార్టీ శాఖ మంత్రి ఎన్.ఎండి.ఫ‌రూక్, ఎమ్మెల్యేలు గ‌ద్దె రామ్మోహ‌న్, బోడే ప్ర‌సాద్, స్వ‌చ్చాంధ్ర కార్పొరేష‌న్ చైర్మ‌న్ కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్, దూదేకుల కార్పారేష‌న్ చైర్మ‌న్ నాగుల్ మీరా, నాట‌క అకాడ‌మీ చైర్మ‌న్ గుమ్మడి గోపాలకృష్ణల‌తో పాటు త‌దిత‌ర ప్ర‌ముఖులు పాల్గొన్నారు.

ఈ స‌మావేశంలో ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమం, అభివృద్ది కోసం, ఉర్దూ భాష కోసం సీఎం చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించారు. అనంతరం త‌మ్మ‌ల‌ప‌ల్లి ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ ఉర్దూ అకాడమీ స్వ‌ర్ణ‌త్సోవ వేడుక‌లు ఇంత ఘనంగా నిర్వ‌హించిన ఉర్దూ అకాడ‌మీ

చైర్మ‌న్ ముహ‌మ్మ‌ద్ ఫారూక్ షిబ్లీ ను అభినందించారు. దేశంలోనే ప్ర‌ప్ర‌ధ‌మంగా ఉర్దూ యూనివ‌ర్శిటీ ఏర్పాటు చేసిన ఘన‌త సీఎం చంద్ర‌బాబుకే ద‌క్కుతుందన్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్రదేశ్ లో టిడిపి వ్య‌వ‌స్థాప‌క అధ్యక్షుడు, దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క‌రామారావు కూడా ఉర్ధూ అకాడ‌మీ ఎంతో తోడ్పాడు అందించి వృద్దిలోకి తీసుకురావ‌టం జ‌రిగింద‌న్నారు. తెలుగు దేశం పార్టీ మైనార్టీల అభివృద్ది, సంక్షేమం తో పాటు ఉర్దూ భాష‌ను కూడా వృద్దిలోకి తీసుకువ‌చ్చేందుకు కృషి చేస్తోంద‌న్నారు.

విభ‌జిత ఆంధ్ర‌ప్రదేశ్ లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు క‌ర్నూల్ లో 175 ఎక‌రాలు ఇచ్చి ఉర్దూ యూనివ‌ర్శిటీ స్థాపిస్తే గ‌త ప్ర‌భుత్వం ఉర్దూ యూనివ‌ర్శిటీకి ఒక రూపాయి కూడా ఖ‌ర్చ‌పెట్ట‌లేదంటూ మండిప‌డ్డారు.

నారా చంద్ర‌బాబు నాయుడు సీఎంగా అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఉర్దూ భాషను అభివృద్ది చేసేందుకు ఉర్దూ అకాడ‌మీ చైర్మ‌న్ గా ముహ‌మ్మ‌ద్ ఫారూక్ షిబ్లీ నియ‌మించ‌టం జ‌రిగిందన్నారు. చైర్మ‌న్ గా షిబ్లీ నెల‌రోజుల్లోనే ఏన్నో కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం జ‌రిగింద‌న్నారు. క‌ర్నూల్ లో కూడా ఉర్దూ యూనివ‌ర్శిటీ ప్రారంభోత్స‌వం వుంటుంద‌ని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments