గుంటూరు మిర్చి యార్డు చైర్మన్‌గా నూతనంగా నియమితులైన శ్రీ కుర్రా అప్పారావు సోమవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి శ్రీ కుర్రా అప్పారావుని శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
మిర్చి రైతుల ప్రయోజనాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని, రైతులకు మేలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ, మిర్చి యార్డు అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని సూచించారు.
రైతుల శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగాలని, ప్రభుత్వం చేపడుతున్న రైతు అనుకూల కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు.
సహకార సంస్థలు, వ్యవసాయ మార్కెట్ యార్డుల అభివృద్ధి ద్వారా ప్రజలకు, రైతులకు మరింత మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.
అదే విధంగా గుంటూరు కల్పవల్లి కో-ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ (సూపర్ బజార్) నూతనంగా పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి పోనగంటి భారతిదేవి.
శ్రీ ఉప్పతల్ల సాంబశివరావు,
శ్రీ చింతకాయల వెంకట సాయి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన బాధ్యతలు స్వీకరించిన సభ్యులకు ఎమ్మెల్యే గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
కల్పవల్లి సూపర్ బజార్ మరింత ప్రజాభిముఖంగా అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
సహకార సంస్థల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా అందరూ సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.




