లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని హిందూ కాలేజీ నందు ఈరోజు సంకల్పం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులకు మత్తు పదార్థాలు మరియు డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు గురించి వివరించి, వారిచే ప్రతిజ్ఞ చేయడం జరిగినది.
ఈ కార్యక్రమం నందు లాలాపేట సిఐ శ్రీ ఏ.వి. శివప్రసాద్ గారు, ఎస్సైలు హషీమ్, వెంకటరావు గార్లు, పోలీస్ స్టేషన్ సిబ్బంది కళాశాల ప్రిన్సిపాల్ ఇతర అధ్యాపక సిబ్బంది మరియు సుమారు 250 విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగినది.




