ఫోర్లు, సిక్సర్ లు, సూపర్ ఓవర్ లతో దద్దరిల్లుతున్న నారా లోకేష్ క్రీడా ప్రాంగణం
9 వ రోజు కొనసాగిన మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్ 4 క్రికెట్ టోర్నమెంట్
మంగళగిరి టౌన్: రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి, మంగళగిరి శాసన సభ్యులు నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి పట్టణంలోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణం(బోగి ఎస్టేట్స్)లో జరుగుతున్న మంగళగిరి ప్రీమియర్ లీగ్ -4 పోటీలు 9 వ రోజు కొనసాగాయి ఈ పోటీల్లో క్రీడాకారులు తమ సత్తా చాటుతున్నారు,ఫోర్లు, సిక్సర్ లు, సూపర్ ఓవర్ లతో ప్రాంగణం సందడిగా మారింది. 9వ రోజు బాషా 786 వర్సెస్ ఏఆర్కే బుల్స్ జట్టుల మధ్య
జరిగిన మ్యాచ్ లో ఏఆర్కే జట్టు విజయం సాధించింది. నవులూరు నవాబ్స్ వర్సెస్ హెలిపాడ్ సీసీ జట్టుల మధ్య జరిగిన మ్యాచ్ లో హెలిపాడ్ సీసీ జట్టు గెలుపొందింది. మురళీ లెవెన్ పార్క్ రోడ్ వర్సెస్ సీ కే పెద్ది లెవెన్ జట్టుల మధ్య జరిగిన మ్యాచ్ లో మురళీ లెవెన్ పార్క్ రోడ్, ఎలైట్ లెవెన్స్ వర్సెస్ శివ పార్వతి టీమ్ జట్టుల మధ్య జరిగిన మ్యాచ్ లో శివ పార్వతి జట్టు,టెక్ 7 వర్సెస్ లెవెన్స్ జట్టుల మధ్య జరిగిన మ్యాచ్ లో లెవెన్స్ జట్టులు విజయం
సాధించాయి. ప్రతి మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన క్రీడాకారుడుకి మాన్ అఫ్ ది మ్యాచ్ ట్రోఫీ, మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ సహకారంతో 3 వేల రూపాయల నగదు బహుమతిని కూటమి నాయకులు అందజేశారు. ఈవెంట్ స్పాన్సర్లుగా సాయి పావని కన్ స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, బిజ్ 51, సోనోవిజన్
హోటల్ డి దేవ్, తాడేపల్లి మెడ్ స్టార్ హాస్పటల్స్, సిగ్నేచర్ డైన్, హైపర్ ప్యాక్ ప్రైవేట్ లిమిటెడ్, కోకోకోలా, వీ వైబ్ ఈవెంట్స్ వ్యవహరించనున్నాయి. ప్రతి మ్యాచ్‌ను గోపీ టీవీ యూట్యూబ్ ఛానల్, వి డిజిటల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అందించడం జరుగుతుంది ప్రీమియర్ లీగ్ సీజన్-4 పోటీలలో ప్రథమ బహుమతి కింద రూ.3 లక్షలు మంగళాద్రి
డెవెలపర్స్, ద్వితీయ బహుమతి కింద రూ 2 లక్షలు మంచికలపూడి వైష్ణవి, తృతీయ బహుమతి కింద రూ.లక్ష నగదును వెలగపూడి కిషోర్ సహకారంతో అందించనున్నారు. అలాగే ప్రతి మ్యాచ్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రూ.3 వేలు జవ్వాది కిరణ్ చందు, ప్రతి మ్యాచ్ టాస్ విన్నర్‌కు సిల్వర్ కాయిన్, అలాగే ఫైనల్ మ్యాచ్ టాస్ విన్నర్‌కు గోల్డ్ కాయిన్
రేవతి జ్యూయలరీ, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కింద ఎలక్ట్రానిక్ బైక్ వల్లభనేని భార్గవ్, బ్యాట్స్ మెన్ ఆఫ్ ది సిరీస్ రూ.25 వేలుతో పాటు ఎలక్ట్రికల్ బై సైకిల్ కాసరనేని జస్వంత్, బౌలర్ ఆఫ్ ది సిరీస్ రూ.25 వేలుతో పాటు బై సైకిల్ గుత్తా
కిషోర్, ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్ రూ.25 వేలతో పాటు బైసైకిల్ తాడిబోయిన మహేష్, వికెట్ కీఫర్ ఆఫ్ ది సిరీస్ రూ. 25 వేలుతో పాటు బై సైకిల్ షేక్ ఇంతియాజ్‌లు అందించనున్నారు. మ్యాచ్‌లో పాల్గొన్న క్రీడాకారులకు టీ షర్ట్స్, ట్రాక్స్ అందజేస్తున్నారు.




