AP Pension IVRS: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక విషయాన్ని సవాలుగా తీసుకుంది. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని అబద్ధం అని నిరూపించాలని భావిస్తోంది. అందుకే పెన్షన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.
ఇక ప్రజలదే భారం. వారే ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిన పరిస్థితి వచ్చింది.ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయిపోయింది. ప్రభుత్వం ప్రతీ నెలా పెన్షన్ ఇస్తోంది. ప్రారంభంలో 3 నెలల పెన్షన్ కూడా అదనంగా ఇచ్చింది. చాలా పెన్షన్లను డబుల్ చేసింది.
అయినప్పటికీ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతూనే ఉంది. ప్రభుత్వం భారీగా పెన్షనర్లను జాబితా నుంచీ తొలగించిందనీ, చాలా మందికి పెన్షన్ ఇవ్వట్లేదనీ.. ఇలా ప్రచారాలు జరుగుతుంటే.. వాటిని ఖండించేందుకు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం (IVRS) సర్వే చెయ్యాలని నిర్ణయించుకుంది.




