Home South Zone Andhra Pradesh PGRS ద్వారా మాజీ సైనిక కుటుంబానికి భూ సమస్య పరిష్కారం |

PGRS ద్వారా మాజీ సైనిక కుటుంబానికి భూ సమస్య పరిష్కారం |

0
1

PGRS ద్వారా మాజీ సైనిక కుటుంబానికి భూ సమస్య పరిష్కారం
బాపట్ల: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం అక్కయపాలెం గ్రామానికి చెందిన శ్రీమతి దీవెల సత్యదేవి గారికి సమస్యకు PGRS ద్వారా పరిష్కారం లభించింది. ఆమె భర్త శ్రీ దివ్వెల చిన్న పున్నారావు (లేట్) మాజీ సైనిక ఉద్యోగి కాగా, మాజీ సైనిక కోటా కింద ఇంటి స్థలం మంజూరు చేయాలని కోరుతూ పీజీఆర్ఎస్‌లో అర్జీ దాఖలు చేశారు.

* ఇప్పటికే య.0.06 సెంట్ల ఇంటి స్థలం మంజూరు చేసినప్పటికీ, మిగిలిన య.0.04 సెంట్లు కూడా మంజూరు చేయాలని కోరుతూ పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు చేశారు.
* ఈ ఫిర్యాదుపై స్పందించిన వేటపాలెం తహసీల్దార్ విచారణ చేపట్టి, కొత్తపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 378/1A, 2Aలో ఉన్న లేఅవుట్‌లో ముందుగా మంజూరైన య.0.06 సెంట్లతో పాటు అదనంగా య.0.04 సెంట్లు కలిపి మొత్తం య.0.10 సెంట్ల భూమిని కేటాయించారు.

సర్వే నిర్వహించి, ఫిర్యాదుదారుని సమక్షంలో హద్దు రాళ్లు పాతించి భూమిని అప్పగించినట్లు అధికారులు తెలిపారు.
* ఈ విధంగా తన సమస్య పూర్తిగా పరిష్కారమవ్వడంతో శ్రీమతి దీవెల సత్యదేవి ఆనందం వ్యక్తం చేస్తూ, కేవలం PGRS గ్రీవెన్స్‌లో అర్జీ పెట్టడం వల్లే న్యాయం లభించిందని పేర్కొన్నారు.

#నరేంద్ర

NO COMMENTS