అమెరికాలో రోడ్డు ప్రమాదం: తెలంగాణకు చెందిన ఇద్దరమ్మాయిల దుర్మరణం!
అమెరికాలో కారు లోయలో పడడంతో ఇద్దరు తెలంగాణ యువతులు మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం….
మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన పులఖండం మేఘనారాణి(25), కరీంనగర్ జిల్లా ముల్కనూరు చెందిన కడియాల భావన(24) ఎంఎస్ చేయడానికి మూడు సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లారు. ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తున్నారు.
భావన, మేఘనా, స్నేహితులతో కలిసి రెండు కార్లలో కాలిఫోర్నియాలో టూర్‌కు వెళ్లారు. భావన, మేఘనా కారులో తిరిగి వస్తుండగా అలబామా హిల్స్ రోడ్డులో మలుపు వద్ద లోయలో పడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగి పోయారు.




