గుంటూరు నగరంలోని 47వ డివిజన్ స్థానిక గోరంట్ల ప్రాంతంలోని రామాలయం వద్ద జనసేన కార్పొరేటర్ యర్రంశెట్టి పద్మావతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘చాయ్ విత్ జనసైనిక్స్’ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్రాణం మార్కండేయబాబు, నాయబ్ కమల్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.
ముందుగా 47వ వార్డులో జనసేన నాయకులతో, జనసైనికులతో కలిసి పాదయాత్రగా సందర్శించడం జరిగింది. వాడవాడలా తిరుగుతూ.. ప్రజలతో మమేకమవుతూ.. వారి నుండి స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకోవడం జరిగింది.
అనంతరం ‘చాయ్ విత్ జనసైనిక్స్’ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న సమస్యలు ప్రజల వద్ద నుండి, జనసైనికుల నుండు తెలుసుకోవడం జరిగింది. 47వ వార్డులో వాకింగ్ ట్రాక్, స్మశాన వాటిక, మంచి నీళ్ల ట్యాంకు, డ్రైనేజీ తదితర సమస్యలపైన ద్రుష్టి పెట్టాలని స్థానికులు వివరించారు.
వెంటనే అధికారులతో మాట్లాడి తక్షణమే సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని మునిసిపల్ అధికారులకి విజ్ఞాపన చెయ్యడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ నాయకులు, నగర కమిటీ నాయకులు, వీరమహిళా విభాగం నాయకులు మరియు జనసైనికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.




