వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని చీరాలశాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య దర్శించుకున్నారు..
చీరాల: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య దర్శించుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేశుని దివ్య దర్శనంతో మనసుకు అపారమైన శాంతి, ఆనందం లభించిందని ఆయన చెప్పారు.
శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, చీరాల నియోజకవర్గం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ప్రార్థించానని వెల్లడించారు.
#నరేంద్ర






