తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ ఆర్టీఐ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతు శ్రీధర్ రెడ్డి
రోడ్లపై కత్తులు, కొడవళ్లతో తిరుగుతూ ఉన్మాదం సృష్టించే వారిని ప్రభుత్వం ఉపేక్షించదన్న హోంమంత్రి అనిత హెచ్చరికలు తెలుగుదేశం పార్టీకి వర్తించవా అని వైయస్సార్సీపీ ఆర్టీఐ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతు శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గతంలో టీడీపీ నాయకుల పుట్టినరోజు వేడుకల్లో ఆ పార్టీ కార్యకర్తలు బహిరంగంగా రోడ్లపై చేసిన జంతు బలులపై ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోకి ఈ విష సంస్కృతికి బీజం వేసిందే తెలుగుదేశం పార్టీ అన్న సంగతి మర్చిపోయి.. ఆ నిందలను వైయస్సార్సీపీ మీద వేయడాన్ని ఆక్షేపించారు. సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా జరిగిన పొట్టేళ్ల బలి గురించి హోం మంత్రికి తెలియదా? అని నిలదీశారు.
మరోవైపు ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ ర్యాలీలో బహిరంగంగా జరిగిన జంతుబలిని ఆమె ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. బాలకృష్ణ సినిమాల విడుదల సమయంలో కటౌట్ లకు పొట్టేళ్ల తలలతో దండలు వేయడంపై ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. చట్టం, న్యాయం అధికారపార్టీకి ఒకలా, ప్రతిపక్ష పార్టీకి మరోలా ఎలా మారిపోతుందని ప్రశ్నించారు.
కదిరి నియోజకవర్గం ముత్యాలవారిపల్లె గ్రామంలో జరిగిన ఒక కుటుంబ తగాదాను వైయస్సార్సీపీకి ఆపాదించే కుట్ర చేసిన హోంమంత్రి .. ప్రజలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఈ సంఘటన గురించి మాట్లాడుతూ వైయస్సార్సీపీని సైకో పార్టీ, మా నాయకుడిని సైకోగా సంబోంధించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ఘటనలో నిందితుడిగా ఉన్న ఆ వ్యక్తి జనసేన పార్టీ కార్యకర్తేనని ఆధారాలతో సహా నిరూపించామని..
. ఇప్పుడు వైయస్సార్సీపీ కార్యకర్తగా తప్పుడు ప్రచారం చేసిన నాయకులను, పార్టీలను సైకోలు, సైకో పార్టీలని సంబోధించవచ్చా అని నిలదీశారు. వైయస్ జగన్ గారి పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన పాత వీడియోలు తీసుకొచ్చి స్వయంగా హోంమంత్రి అనిత దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని చెప్పారు.
వైయస్సార్సీపీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఇప్పటికే ఏపీ పోలీస్ వ్యవస్థను దేశంలోనే అట్టడుగున నిలబెట్టి, పోలీస్ శాఖ ప్రతిష్టను దారుణంగా దెబ్బతీశారని శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు.




