Thursday, January 1, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshకూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చేలా: ధర్మవరం సుబ్బారెడ్డి |

కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చేలా: ధర్మవరం సుబ్బారెడ్డి |

కర్నూలు :

2025 కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేరుస్తూ, రాష్ట్రం అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ ఎన్నో విజయాలు సాధించింది..ఆంధ్రప్రదేశ్‌లో  కూటమి ప్రభుత్వం రాష్ట్రా ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేరుస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకపోతుందని  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి గారు అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవం, పవన్ కళ్యాణ్ గారి పట్టుదల మరియు కేంద్ర ప్రభుత్వ మద్దతు కలిసి రాష్ట్రానికి ఒక కొత్త భరోసాను ఇచ్చాయని గత కొద్ది కాలంగా నిలిచిపోయిన అభివృద్ధి చక్రం ఇప్పుడు మళ్ళీ వేగంగా తిరుగుతోందని అన్నారు.

2025లో కూటమి ప్రభుత్వ విజయాలు సాధించిన విజయాలన ఒకసారి చూస్తే  సూపర్ సిక్స్ పథకాల సూపర్ హిట్ చేశామని,తల్లికి వందనం పథకం రూ.10,090 కోట్లు చెల్లింపు, 67.27 లక్షల మంది విద్యార్ధులకు సాయం కూటమి ప్రభుత్వం చేసింది. స్త్రీ శక్తి ఆగస్ట్ 15 నుంచి పథకం ప్రారంభం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం… ఇప్పటి వరకు 3.25 కోట్ల ప్రయాణాలు. ఇప్పటి వరకు ఈ పథకానికి రూ.1,144 కోట్ల వ్యయం అయిందని అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 46 లక్షల మంది రైతులకు… రూ.6,310 కోట్లు రైతుల ఖాతాలో జమచేశామని, దీపం–2 ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు, రూ.2,684 కోట్లు,

ఇప్పటికి దాదాపు 2 కోట్ల సిలిండర్ల పంపిణీ చేశామన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇప్పటివరకు రూ.50,000 కోట్లకు పైగా పెన్షన్ల కోసం వ్యయం… ఏడాదిలో రూ.33,000 కోట్లు పంపిణీ, నెలకు రూ.2,750 కోట్లు, మత్స్యకార భరోసా : ఏడాదికి 20 వేల చొప్పున 1.25 లక్షల మందికి రూ.250 కోట్లు ఇచ్చామని అన్నారు, నేతన్నలకు ఉచిత విద్యుత్ : మర మగ్గాలకు నెలకు 500 యూనిట్లు, మగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించామన్నారు. అదేవిధంగా ఆటో డ్రైవర్ల సేవలో : ఏడాదికి రూ.15,000… రూ.436 కోట్లు జమ, 2.90 లక్షల మందికి లబ్ది  కూటమి ప్రభుత్వం చేకూర్చిందన్నారు. అన్నా క్యాంటిన్ : 204 అన్నా క్యాంటిన్లు.

ఇప్పటి వ రకు 4 కోట్ల భోజనాలు అందించామని,గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపుల కేటాయించామన్నారు. వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ – స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ ఏడాది మైనారిటీ సంక్షేమానికి రూ. 3,670 కోట్లు వ్యయం.15. 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనం రూ.51 కోట్లు . ఇమామ్‌లకు నెలకు రూ.10,000 మౌజన్లకు రూ.5,000 చొప్పున ఏడాదికి రూ.90 కోట్లు.పురోహితులకు నెలకు రూ.15,000కు వేతనాల పెంపు -నాయీ బ్రాహ్మణులకు నెలకు రూ.25,000కు వేతనాల పెంపు. జూనియర్ లాయర్లకు రూ.10,000 గౌరవ వేతనం – మహిళలకు లక్ష కుట్టు మిషన్ల పంపిణీ.మెగా డీఎస్సీ… ముఖ్యమంత్రి తొలి సంతకం. 15,941 టీచర్ పోస్టుల భర్తీ20. 5,757 కానిస్టేబుల్ పోస్టుల నియామకం పూర్తి, రూ.4,500 నుంచి రూ.12,500కు స్టైఫండ్ పెంపు.

అంగన్‌వాడి కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు – బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్లు.దాదాపు 84 లక్షల టన్నుల చెత్త తొలగింపు.  ప్రతీ నెల ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’. డోర్ టు డోర్ కలెక్షన్. రూ.1,000 కోట్లతో రోడ్ల మరమ్మతులు. మరో రూ.3,000 కోట్లతో రహదారుల నిర్మాణం.కొత్తగా 23 పాలసీలు, పరిశ్రమలకు రాయితీలకు దేశంలో తొలి సారి ఎస్క్రో ఖాతాలు. సీఐఐ సమ్మిట్ 610 ఒప్పందాలు. రూ.13.25 లక్షల

కోట్ల పెట్టుబడులు, 16.13 లక్షల ఉద్యోగాలు.13 ఎస్ఐపీబీ సమావేశాల్లో రూ.8.55 పెట్టుబడులు, 8.23 లక్షల ఉద్యోగాలు.175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్.విశాఖ ఐటీ హబ్, గూగుల్ – రిలయన్స్ డేటా సెంటర్, టీసీఎస్ ప్రారంభం, కాగ్నిజెంట్‌కు శంకుస్థాపన. రాష్ట్రమంతటా ఒకే రోజు 13,326 గ్రామ సభల నిర్వహణ, దాదాపు 3 వేల పనులకు శ్రీకారం.రికార్డ్ స్థాయిలో ధాన్యం సేకరణ,

24 గంటల్లో జమ. ఈ ఖరీఫ్‌ సీజన్లో 34.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ, 5.48 లక్షల మంది రైతులకు రూ.8,120 కోట్లు జమ.మార్కెట్ ఇంటర్వెన్షన్ – పొగాకు, మామిడి, కోకో, ఉల్లి సహా పంటలకు రూ.1,100 కోట్లకు పైగా సాయం.డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్, పారదర్శకంగా బదిలీలు.కొత్తగా మరో రెండు జిల్లాల ఏర్పాటుకు ప్రజామోదం, 26 నుంచి 28కి పెరగనున్న జిల్లాల సంఖ్య ఇలా 2025 లో ఎన్నో విజయాలు సాధించిందని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments