గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండల కేంద్రమైన ఫిరంగిపురం కొండ సమీపంలో ఉన్న గొల్లపాలెంలో సోమవారం ఇళ్లపై కొండ బ్లాస్టింగ్ రాళ్లు పడి ఇబ్బందులు పడిన బాధితులను జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు జనసేన పార్టీ నాయకులను కార్యకర్తలను కలుపుకొని మంగళవారం గొల్లపాలెం గ్రామంలో సందర్శించి బాధితులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గాదె మాట్లాడుతూ;
గొల్లపాలెం లో బ్లాస్టింగ్ ల కారణంగా రాళ్లుపడి ఇళ్ళు ధ్వంసమై ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న బాధితులకు జనసేన పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఈ ఫిరంగిపురం క్వారీల్లో గ్రానైట్ తీసే పనులకు సరైన అనుమతులు ఉన్నాయో లేదో తెలియడం లేదని ఈ కొండ బ్లాస్టింగ్లు కారణంగా కొండ చుట్టూ నివాసముంటున్న ప్రజలు నిత్యం భయభ్రాంతులతో ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులతొ ఇక్కడ సంఘటనలు కనిపిస్తున్నాయని, మండల కేంద్రంలో కూతవేటుగా రెవిన్యూ ఎంపీడీవో పోలీస్ కార్యాలయాలు అందుబాటులో ఉన్నప్పటికీ గ్రామ ప్రజలకు న్యాయం జరగకపోవడం బాధాకరమన్నారు.
జనసేన పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ ప్రజల పక్షాన పార్టీ ఉంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యమని గుర్తు చేశారు. ఫిరంగిపురం కొండపై తొ వ్వుతున్న గ్రానైట్ పనులకు అనుమతులు ఎంతవరకు ఉన్నాయో ప్రభుత్వాలకు ఆదాయం చెల్లిస్తుందా లేదా అనే వివరాలు మైనింగ్ శాఖ నుంచి సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. కొండ చుట్టూ వేల కుటుంబాలు నివసిస్తున్న ఈ కొండను తవ్వడానికి వీలులేదని ఏ సంఘటన జరిగినా గొల్లపాలెం కొండ చుట్టూ
ఉన్న ప్రజలకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రకృతి సంపదను కొండ చుట్టూ ఉన్న నివాస ప్రాంత ప్రజలకు ఉపయోగపడ కుండా ఎవరో ఉమ్మడి ఇద్దరు బడా నేతలు వచ్చి కొండను కొల్లగొట్టేసి ప్రభుత్వాలకు లెక్క చెప్పకుండా సొమ్ము చేసుకుని పోవడం దుర్మార్గమన్నారు. బ్రతుకు జీవుడా అంటూ కూలినాలి చేసుకొని కుటుంబాలతో జీవిస్తూ ఉన్నదాంట్లోనే ఇల్లు కట్టుకుంటే వాటిపై దుమ్ము దూళితో పాటు బ్లాకింగ్ శబ్దాలకు కట్టుకున్న ఇళ్లకు క్రాకులిచ్చి ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్న సంఘటనలు ఈ గ్రామంలో కనిపిస్తున్నాయి.
ఇంత తతంగం జరుగుతున్న ప్రజా సంక్షేమం పట్ల దృష్టి సారించాల్సిన అధికారులు లంచాలకు అలవాటు పడి నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా కనిపిస్తుందని ఆరోపించారు. ఈ క్వారీల నుంచి ప్రజలు ఇబ్బందులు పడకుండా క్వారీలు మూసి వేయించేంతవరకు జనసేన పార్టీ గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ శిఖా బాలు ,ఫిరంగిపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ తడవర్తి కేశవరావు, జనసేన పార్టీ జిల్లా నాయకు కొప్పుల కిరణ్ బాబు,ముమ్మలనేని సతీష్, బందనాథం జ్యోతి, నక్కల వంశీకృష్ణ, మండల ఉపాధ్యక్షుడు గోసాల విజయ్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి మల్లెల అనిత, తదితరులు పాల్గొన్నారు




