పుంగనూరు మండలంలో రోడ్డు ప్రమాదం
మంగళవారం రాత్రి పుంగనూరు మండలం నూతన బైపాస్ మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పలమనేరు నుంచి పుంగనూరుకు వస్తున్న ఆర్టీసీ బస్సు బైకును ఢీకొనడంతో గుడిసె బండకు చెందిన సోమశేఖర్ (27).
అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.




