Wednesday, December 31, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఫోర్త్ సిటీ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే డిపిఆర్ కోసం టెండర్స్

ఫోర్త్ సిటీ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే డిపిఆర్ కోసం టెండర్స్

ఫోర్త్ సిటీ అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే డీపీఆర్ కోసం టెండర్స్*

ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు వరకు నిర్మించనున్న హైదరాబాద్ -అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే డీపీఆర్ తయారీ కోసం టెండర్లు పిలిచారు.

సుమారు 298కిలో మీటర్లు పోడవుతో నిర్మించే ఈ హైవే 12 లేన్లతో తెలంగాణలో 118 కిలోమీటర్లు, ఏపీలో 180కిలో మీటర్లు కొనసాగనుంది.

కేంద్రానికి సమర్పించిన ప్రాథమిక అలైన్ మెంట్ ప్రకారం ముచ్చెర్ల వద్ద ఉన్న ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి మార్గంలో బందర్ పోర్టు వరకు వెళ్తుంది. ప్రతిపాదిత మార్గం 2 రాష్ట్రాలు.. 5 జిల్లాలు, 100 గ్రామాల మీదుగా వెళ్లనుంది. తెలంగాణలో ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పరిధిలోని దాదాపు 40 గ్రామాల నుంచి రహదారి కొనసాగనుంది. ఏపీ భూభాగంలోకి ప్రవేశించిన తర్వాత కృష్ణా, గుంటూరు (అమరావతి క్యాపిటల్‌ సిటీ), పల్నాడు జిల్లాల మీదుగా బందరు పోర్టు వరకు 60 గ్రామాల నుంచి రహదారి నిర్మాణం కానుంది.

*సరుకు రవాణ..ప్రజా రవాణ సమయం ఆదా*

గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే ప్రాథమికంగా రూపొందించిన అలైన్‌మెంట్‌ ప్రకారం.. ఔటర్‌ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్‌) – రీజనల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) మధ్యలో ప్రభుత్వం ప్రతిపాదించిన భారత్‌ ఫ్యూచర్‌ సిటీకి (ముచ్చర్ల ) దగ్గర్లో ఉన్న తిప్పారెడ్డిపల్లికి కొంత దూరంలో కుడివైపు నుంచి ఈ రహదారి ప్రారంభమై అమరావతి క్యాపిటల్‌ సిటీకి పక్క నుంచి లంకెలపల్లి మీదుగా బందరు పోర్టుకు అనుసంధానం కానుంది. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నేరుగా కనెక్టివిటీ పెరిగి..ప్రయాణ సమయం ఆదా అవుతుంది. అలాగే బందర్ పోర్టు నుంచి నేరుగా తెలంగాణకు రహదారి ఏర్పాటుతో సరుకు రవాణా వ్యవస్థ మెరుగుపడనుంది.

*భూసేకరణ ప్రక్రియ ప్రారంభం*

ఇప్పటికే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం భూసేకరణ ప్రక్రియ ప్రారంభించారు.

5 వేల ఎకరాలకు పైగా సాగు భూసేకరణ చేయబోతున్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర, అటవీ భూములు, చెరువులు, కుంటలు ఎన్ని ఉన్నాయనే వివరాలను కూడా ప్రాథమికంగా తేల్చారు. ఇప్పటికే 340 కి.మీ పైగా పొడవున 6 లేన్లతో ప్రతిపాదించిన ట్రిపుల్‌ ఆర్‌తో సుమారు 5 వేల ఎకరాలకుపైగా భూములు ప్రభావితమవుతున్నాయి. గ్రీన్ ఫీల్డ్ హైవేతో మరో 5వేల ఎకరాలను బాధితులు కోల్పోవాల్సి వస్తుంది. అయితే బహిరంగ మార్కెట్‌ ధర చెల్లించాల్సి వచ్చినా కూడా రైతులు భూసేకరణకు వ్యతిరేకత చూపుతున్నారు.

ఇప్పటికే సంగారెడ్డి, యాదాద్రి, చౌటుప్పల్‌, భువనగిరి, వలిగొండ తదితర ప్రాంతాల్లో ట్రిపుల్‌ఆర్‌ భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన నిర్వహిస్తున్నా రు. అది అలా ఉండగానే ఫ్యూచర్‌ సిటీ-బందరు పోర్టు గ్రీన్‌ఫీల్డ్‌ హైవే తెరపైకి వచ్చింది. డీపీఆర్‌ వెల్లడయ్యాక దీనిపై కూడా రైతులు ఉద్యమించే అవకాశం ఉందంటున్నారు.

*హైదరాబాద్ – విజయవాడ హైవే*

*విస్తరణకు రూ.10వేల కోట్లు*

హైదరాబాద్ – విజయవాడ మార్గం మధ్య ప్రస్తుతం 4 వరుసల రహదారి ఉండగా.. దాన్ని 6 వరుసలుగా విస్తరిస్తున్నారు. దీనిని రూ. 9,090 కోట్లతో నిర్మించనున్నారు. దీనిని రూ.10వేల కోట్లతో 8 లేన్లకు విస్తరించేందుకు సంబంధించిన టెండర్లు పూర్తయ్యాయి. ఏప్రిల్ నుంచి పనులు మొదలుకానున్నాయి.

హైదరాబాద్ – శ్రీశైలం మార్గంలో 150 కిలోమీటర్ల దూరాన్ని 4 వరుసలుగా.. నాగ్‌పూర్ – హైదరాబాద్ మధ్య ఉన్న దాదాపు 397 కిలోమీటర్ల రహదారిని 6 వరుసలగా తీర్చిదిద్దనున్నారు. హైదరాబాద్-బెంగళూరు మధ్య ఉన్న మార్గాన్ని రూ. 5,221 కోట్లతో ఎక్స్ ప్రెస్‌వేగా మార్చేందుకు కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments