Thursday, January 1, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshవికసిద్భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ చైర్మన్ విలేకరుల సమావేశం

వికసిద్భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ చైర్మన్ విలేకరుల సమావేశం

లంకా దినకర్, ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు ( వికసిత్ భారత్ – స్వర్ణాంధ్రప్రదేశ్ ) ఛైర్మెన్, విలేకరుల సమావేశం, తేదీ : 31 డిసెంబర్ 2025 , ఏపీ సచివాలయం, వెలగపూడి, అమరావతి :

2025 సంవత్సరంలో కేంద్ర మరియు రాష్ట్ర పాలనలో డబుల్ ఇంజన్ సర్కార్ విజయాలు ఉజ్వల భవిష్యత్ కు సోపానాలు :

గడచిన 2025వ సంవత్సర విజయాలను నెమరు వేసుకుంటూ దేశ మరియు ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరం 2026 మరింత మంచి జరగాలని కలియుగ ఇష్ట దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం స్వర్ణాంధ్ర ప్రదేశ్ ని ప్రధాని నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత్ భారత్ లో భాగస్వామ్యం చేసే కార్యాచరణలో మా బాధ్యతను 2025 లో ఎలా నిర్వహించామో, అదే స్ఫూర్తితో 2026 లో కూడా కొనసాగిస్తాం.

2025 లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలు :

1) పెట్టుబడుల ఆకర్షణ : ప్రభుత్వం ఆమోదం తెలిపిన 8.55 లక్షల కోట్ల రూపాయిల పెట్టుబడుల ద్వారా 8.23 లక్షల ఉద్యోగాలకు అవకాశం కల్పన మరియు విశాఖపట్టణం సిఐఐ సదస్సు ద్వారా 13.25 లక్షల కోట్ల రూపాయిల ఒప్పందాలు ద్వారా 16.13 లక్షల మంది యువతకు ఉద్యోగ, ఉపాధికి మార్గం సుగమం, పెట్టుబడులకు స్వర్గధామంగా ఉత్తరాంధ్ర, ప్రకాశం మరియు రాయలసీమ జిల్లాలకు పెద్దపీట.

2) సూపర్ సిక్స్ అమలు ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీని నెలబెట్టుకున్నాం – అన్నదాత సుఖీభవ క్రింద 46 లక్షల మంది రైతులకు 6,310 కోట్లు రైతులకు జమ చేయడం, తల్లికి వందనం క్రింద 67.27 లక్షల మందికి 10,090 కోట్లు, దీపం – 2 క్రింద పేదలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లుకు 2,486 కోట్లు, స్త్రీ శక్తి క్రింద మహిళకు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటివరకు 3.25 కోట్ల ప్రయాణాలకు 1,144 కోట్లు, 20 లక్షల ఉద్యోగాల కల్పనకు పెట్టుబడుల ఆకర్షణ.

3) అమరావతి – పోలవరం మరియు నదుల అనుసంధానం ప్రగతి : అమరావతిలో పనుల వేగం ఊపందుకుంది. కేంద్ర ప్రభుత్వం సహాయం 15 వేల కోట్ల కేంద్ర ఆర్థిక సహాయం, ఓఆర్ఆర్ నిర్మాణం, బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల నిర్మాణానికి శంకుస్థాపనలు మరియు ఇతర భారీ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి.

రాష్ట్ర జీవనాడి పోలవరం కోసం 2025 వరకు దాదాపు 18 వేల కోట్ల రూపాయిలను విడుదల చేసి, మొదటి దశ పూర్తీ కోసం 12,911 కోట్ల రూపాయిల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందడం జరిగింది, పనులు వేగంగా జరుగుతున్నాయి, మరోవంక పశ్చిమ ప్రకాశం జిల్లా వరప్రదాయిని వెలికిగొండ మొదటి దశను రాబోయే కొత్త సంవత్సరంలో పూర్తీ చేయడమే కాకుండా నదుల అనుసంధానం చేయడం ద్వారా ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం ద్వారా శాశ్వత సురక్షిత త్రాగు నీరు, సాగు మరియు పారిశ్రామిక అవసరాలకు నీటి వనరుల లభ్యతకు డబుల్ ఇంజన్ సర్కార్ ప్రాధాన్యత ఇస్తుంది.

4) విద్యా – వైద్యంలో ముందడుగు : తల్లికి వందనం క్రింద 67.27 లక్షల మంది విద్యార్థులకు 10,090 కోట్లు సహాయం, డొక్కా సీతమ్మ – పీఎం పోషణ ద్వారా మధ్యాహ్న భోజన పథకం క్రింద దాదాపు 25 లక్షల మంది పైగా విద్యార్థులు నాణ్యమైన భోజనం చేస్తున్నారు , మన బడి – మన భవిష్యత్తు మరియు పీఎం శ్రీ పథకం క్రింద రాష్ట్రంలోని వేలాది పాఠశాలలను ఆధునిక మౌలిక సదుపాయాలతో 16 వేల నూతన అధ్యాపకులను డిఎస్సి ద్వారా నియమించి, సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, స్కూల్ యూనిఫార్మ్, బ్యాగులు, షూ ఉచితంగా అందించడం జరిగింది.

ఎన్టీఆర్ విద్య సేవ – ఆయుష్మాన్ భారత్ ద్వారా డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడిన తరువాత ఇప్పటివరకు 20 లక్షల మందికి పైగా వివిధరకాల విద్య సేవలు అందించడం జరిగింది. పీపీపీ విధానంతో వైద్య కళాశాలను పూర్తీ చేసి వేగంగా పేదలకు మెరుగైన వైద్య సౌకర్యాలను అందించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే, మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు తప్పుడు ప్రచారాలతో వాస్తవాలను పక్కదోవ పట్టిస్తున్నారు

5) ఇప్పటి వరకు ఏడాదికి 33 వేల కోట్ల చొప్పున 50 వేల కోట్ల రూపాయిల పింఛన్లును , నేతన్నలకు మర మగ్గాలు 500 యూనిట్ల మరియు మగ్గాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తూ, 1.25 లక్షల మంది మత్స్యకారులకు 250 కోట్ల మత్స్యకారుల భరోసా మరియు 2.90 లక్షల ఆటో డ్రైవర్లకు 15 వేలు చొప్పున 436 కోట్లు సహాయం, పేదవాడికి అన్న క్యాంటీన్లతో పట్టెడు అన్నం పెట్టడం కోసం 204 క్యాంటీన్లలో 4 కోట్ల భోజనాలు అందించడం జరిగింది.

ఇలా చెప్పుకుంటూ పొతే అనేక పథకాల ద్వారా రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ సర్కార్ పేద, మధ్య తరగతికి చెందిన అన్ని వర్గాల ప్రజలకు భరోసాగా నిలుస్తూ సహాయం అందిస్తూ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లో వారిని భాగస్వామ్యం చేసే సుపరిపాలన తో ముందుకు వెళ్తుంది.

మరోవంక రాష్ట్ర ఆర్ధిక వృద్ది – ప్రగతి – స్వర్ణాంధ్ర – ప్రజల ఆకాంక్షల మేరకు మార్కాపురం మరియు పోలవరం నూతన జిల్లాలు మరియు వివిధ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయడంతో గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు దిద్దుబాటు అయ్యింది.

2025 లో కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు :

1) జీఎస్టీ సంస్కరణలు – ప్రజల కొనుగోలు శక్తి పెరుగుదల

2) ఆదాయపన్ను 12 లక్షల రూపాయిల వరకు మినహాయింపు ద్వారా ఉద్యోగులకు ఊరట కలిగింది.

3) రేపో రేట్ తగ్గించడం ద్వారా హౌసింగ్ లోన్ వాయిదాలు సగటున 3,500 – 4,000 రూపాయిల మధ్య తగ్గింపు

4) దేశంలో లాక్ పతి దీదీలుగా 3 కోట్ల మహిళలు లక్ష్యం చాలా వేగంగా ముందుకు వెళ్తుంది,

5) వీబీ జి రామ్ జి ద్వారా ఉపాధి హామీలో ఉన్న బోగస్ చెల్లింపులకు సాంకేతికతో చెక్ – గారంటీ పనిదినాలు 125 కి పెంపు మరియు వ్యవసాయ పనుల సమయంలో 60 రోజులు పథకం అమలుకు హాలిడే వల్ల రైతులకు కూలీలు లభ్యం మరియు 125 రోజుల పని దినాలకు మరో 60 పని దినాలకు అవకాశం కలిగింది.

2014 లో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలలో 11 స్థానంలో, 2025 లో 4 వ స్థానంకు చేరగా, 2026 లో మూడవస్థానంకు చేరుకొని వికసిత్ భారత్ కి బాటలు వేస్తుంది. రాబోయే 2026 – 27 కేంద్ర బడ్జెట్ పేద, మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలు, శూలభతర జీవనానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన దిశగా సమ్మిళిత అభివృద్ధికి దిక్సూచిగా నిలుస్తుంది.

2025 లో నిర్వహించిన జిల్లాల సమీక్షలు& వివిధ రాష్ట్రాల పర్యటనలు – ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నివేదికలు :

కేంద్ర మరియు రాష్ట్ర పథకాలు, ప్రాజెక్టుల అమలు పైన సమీక్ష కొరకు 26 జిల్లాల మొదటి దశ పర్యటన మరియు రెండవ దశలో ఇప్పటి వరకు 7 జిల్లాలు పూర్తీ చేయడం జరిగింది. ఇవి కాకుండా రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో మరో 14 అంశాలలో ముఖ్యమైన సమీక్షలు చేసి నివేదికలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పంపడం జరిగింది మరియు జిఎస్టీ అవగాహన సదస్సులు కొరకు 7 జిల్లాలో పర్యటన చేయడం జరిగింది.

ప్రత్యేకంగా వెలిగొండ ప్రాజెక్టు సమీక్ష మరియు నదుల అనుసంధానంలో ప్రాధాన్యత నివేదిక, ప్రకాశం జిల్లా ఫ్లోరైడ్ సమస్య పైన సమీక్ష, మొంత తుఫాను పైన ప్రకాశం జిల్లా సమీక్ష, పశ్చిమ ప్రకాశం జిల్లా పర్యాటక రంగం అభివృద్ధి పైన సమీక్ష, కడప-ప్రకాశం జిల్లాల ఆకాంక్షిత జిల్లాలు మరియు బ్లాకుల పైన సమీక్ష, గండికోట పర్యాటక అభివృద్ధి సమీక్ష, మదనపల్లి టమోటా మార్కెట్ యార్డ్ లో సమీక్ష మరియు పునః సమీక్ష , అన్నమయ్య జిల్లా పిఎం ధన ధాన్య కృషి యోజన సమీక్ష, మెప్మా మరియు సెర్ప్ అధికారులతో స్వయం సహాయక గ్రూపుల అవకతవకల పైన సమీక్ష.

ఎంఎస్ఎంఈ మరియు సీడాప్ చైర్మెన్లతో కలిసి సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమల వృద్ధికి సమీక్ష, ప్రణాళిక శాఖ అధికారులతో ఎస్డీజీ కేంద్రం ఏర్పాటు పైన సమీక్ష, వికసిత్ భారత్- స్వర్ణాంధ్ర లక్ష్యంగా ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు పునర్వ్యవస్థీకరణ పైన సమీక్ష, ఉపాధిహామీ, గృహ నిర్మాణం, జల్ జీవన్ మిషన్ అమలు తదితర అంశాలకు సంబంధించిన అధికారులతో సమీక్షలు నిర్వహించి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నివేదికలు మరియు లేఖలు ఇచ్చాం.

రెండవ దశ విద్య , వైద్యం, జల్ జీవన్ మిషన్, అమృత్ , పీఎం సూర్య ఘర్, కుసుమ్ పథకాలను వివిధ జిల్లాల సమీక్షలు ఇప్పటికే 7 జిల్లాలు పూర్తి అయ్యాయి.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో మరియు అధికారుల సహాయ సహకార సమన్వయంతో గడచిన 14 నెలలో స్వర్ణాంధ్ర సాధన లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత్ భారత్ లో భాగస్వామ్యం చేయడం ధ్యేయంతో బాధ్యతలు నిర్వహించడం జరిగింది.

2025 లో రాజస్థాన్ ప్రభుత్వంతో కలిసి ఆ రాష్ట్రంలో వివిధ కేంద్ర పథకాలు, ప్రాజెక్టుల అమలు అవగాహన పైన ఆ రాష్ట్ర అధికారులతో కలిసి సమీక్ష చేయడం జరిగింది, అలాగే రాజస్థాన్ అధికారులు మన రాష్ట్రానికి వచ్చి ఇక్కడ మన రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు మరియు ప్రాజెక్టుల పైన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. 2026 జనవరి రెండు మరియు మూడు వారాలలో ఇదే తరహా కార్యక్రమాలకు ఉత్తర్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాల పర్యటనకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖత వ్యక్తం చేశాయి.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం స్వర్ణాంధ్ర ప్రదేశ్ ని ప్రధాని నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత్ భారత్ లో భాగస్వామ్యం చేసే కార్యాచరణలో మా బాధ్యతను 2025 లో ఎలా నిర్వహించామో, అదే స్ఫూర్తితో 2026 లో కూడా కొనసాగిస్తాం. నూతన సంవత్సరం 2026 లో ప్రజల ఆశీస్సులు మరియు సహకారం ఇదే స్పూర్తితో డబుల్ ఇంజన్ సర్కారుకి కొనసాగాలని ప్రార్దిస్తున్నాము.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments