గుంటూరు నగరంలోని నెహ్రు నగర్56వ డివిజన్ కార్పొరేటర్ ఆయి శెట్టి కనకదుర్గ శ్రీనివాస్ మార్కెట్ (శ్రీను) ఆధ్వర్యంలో 2026 సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు వారు మీడియా ద్వారా తెలియజేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వారి ట్రస్ట్ తరఫున సంక్రాంతి సంబరాలు నిర్వహించడంతోపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ కోమల వల్లి తాయారు సమేత శ్రీ సారంగపాణి స్వామి వారి ధనుర్రాస మహోత్సవములు కార్యక్రమాలు కూడా జరుగుతాయని వారు తెలిపారు 30వ తారీఖున అనగా మంగళవారం నాడు శ్రీ కోమలవల్లి తాయారు సమేత సి సారంగ పాణి స్వామివారి అఖండస్థాపన మరియు ప్రత్యేక పూజ కార్యక్రమాలు
జరిగాయని తెలిపారు మొదటి రోజు మంగళవారం నాడు గుంటూరు నగరం జిజిహెచ్ సూపర్డెంట్ డాక్టర్ఎస్ఎస్సి రమణ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను సేకరించారు. జనవరి 17 తారీకు వరకు జరిగే యొక్క మహోత్సవములకు ప్రతి ఒక్కరూ ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి తీర్థప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. విచ్చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా
అన్ని ఏర్పాట్లు చేయడం జరిగాయని వారు తెలిపారు 12వ తారీకు సోమవారం నాడు గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జనవరి 17 తారీకు వరకు జరిగే ఈ యొక్క ప్రత్యేక పూజా కార్యక్రమాలతో సంక్రాంతి సంబరాలకు ప్రతి ఒక్కరు హాజరై ఈ యొక్క కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా తెలిపారు.




