పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో సోమవారం ఒంటరి ఏనుగు పంటలను ధ్వంసం చేసింది. పాలెం పంచాయితీ కోటపల్లి సమీపంలో గోపి, మోహన్.
దామోదర్, కళావతికి చెందిన మామిడి చెట్లను ఏనుగు నాశనం చేసింది. పశుగ్రాసాన్ని కూడా తినేసి, అనంతరం అడవిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనపై స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్బీఓ మధు పంటలను పరిశీలించి, రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు# కొత్తూరు మురళి.




