Home South Zone Andhra Pradesh కొత్త ఏడాదిలో 50 వేల కోట్ల పింఛన్లపై ఖర్చు|

కొత్త ఏడాదిలో 50 వేల కోట్ల పింఛన్లపై ఖర్చు|

0
0

ఎక్కడా లేనివిధంగా రూ.50 వేల కోట్లకుపైగా పింఛన్లపై ఖర్చు

కొత్త ఏడాదికి ఒకరోజు ముందుగానే పింఛను సొమ్ము అందిస్తున్న కూటమి ప్రభుత్వం

చంద్రబాబు నేతృత్వం.. కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తోంది

టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్ మండలం (గొల్లపూడి) – 31 డిసెంబరు 2025

జనవరి 1వ తేదీ నూతన సంవత్సరం సందర్భంగా.. డిసెంబర్ 31వ తేదీన.. ఒక రోజు ముందుగానే పింఛన్లు పంపిణీని ఏపీ ప్రభుత్వం చేపట్టిందని, రాష్ట్రంలో 63.12 లక్షల మందికి పింఛన్లు ఇచ్చేందుకు రూ. 2,743 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. బుధవారం గొల్లపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.

ఇప్పటి వరకు ఎక్కడా లేనివిధంగా రూ.50 వేల కోట్లకుపైగా పింఛన్లపై కూటమి ప్రభుత్వం ఖర్చు చేసారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రగతి కోసం చంద్రబాబు, లోకేశ్, పవన్ తీవ్రంగా కృషిచేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మంగళగిరి ఎయిమ్స్‌కు 31 లక్షల ఓపీలు వచ్చాయని… వేల కొలది ఆపరేషన్లు జరిగాయన్నారు.

జగన్ ఐదేళ్ల కాలంలో కనీసం మంచినీళ్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. వారానికోసారి బెంగళూరు ప్యాలెస్ నుండి జగన్ వచ్చి కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు ఎవరెన్ని కుట్రలు పన్నినా పేదల సేవలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, 2026 నూతన సంవత్సరంలో మరింతగా అబివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తారని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.

NO COMMENTS