Home South Zone Andhra Pradesh గంజాయి ధ్వంసం : కర్నూలు అడ్మిన్ ఎస్పీ

గంజాయి ధ్వంసం : కర్నూలు అడ్మిన్ ఎస్పీ

0
0

కర్నూలు :

కర్నూలుజిల్లా…10  లక్షల  33 వేల  విలువ గల గంజాయి ధ్వంసం … అడిషనల్ ఎస్పీ అడ్మిన్  శ్రీ హుస్సేన్ పీరా . గౌరవ ఏపీ  డిజిపి గారి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  గారి పర్యవేక్షణలో  మంగళవారం భారీగా గంజాయిని ధ్వంసం చేసి నిప్పు అంటించి  తగలబెట్టారు. ఈ సంధర్బంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్  శ్రీ హుస్సేన్ పీరా   గారు  మాట్లాడుతూ…ఈ రోజు  కర్నూలు జిల్లా లోని వివిధ పోలీసుస్టేషన్ ల

పరిధులలో  27  కేసులలో  స్వాధీనం చేసుకున్న  126 కేజీ ల గంజాయిని   కర్నూలు నగర సమీపంలోని దిన్నేదేవరపాడు దగ్గర ఉన్న  జిల్లా పోలీసు ఫైరింగ్ రేంజ్ ప్రాంతంలో  ఎక్సైజ్  అధికారులు, రెవిన్యూ అధికారులు కలిసి ధ్వంసం చేశామన్నారు.  పెండింగ్ ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ మొత్తాన్ని కోర్టు మెజిస్ట్రేట్  అనుమతితో , NDPS  Act  ప్రకారం ప్రోసిడింగ్స్ చేసి పంచనామా  ప్రకారం గంజాయిని ధ్వంసం చేసి కాల్చి వేయడం

జరిగిందన్నారు. దహనం చేసిన గంజాయి విలువ   రూ. 10 లక్షల 33 వేలు ఉంటుందన్నారు. జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక దృష్టి ఉంచామన్నారు.  ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ గారితో పాటు ఎక్సైజ్ అడిషనల్ ఎస్పీ సుధీర్ బాబు , కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్,  ఎక్సైజ్ డిఎస్పీ రామకృష్ణా రెడ్డి,  నోడల్ ఆఫీసర్ సిఐ గుణశేఖర్ బాబు,  సిఐలు తేజమూర్తి, విక్రమసింహ, శేషయ్య, నాగరాజారావు, ఇతర ఎస్సైలు  పాల్గొన్నారు.

NO COMMENTS