గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో పార్కింగ్ ఫీజు వసూళ్ల పేరుతో రోగులను ఇబ్బంది పెడుతున్నారని, అవమానకరంగా మాట్లాడుతున్నారని మంగళవారం వచ్చిన వార్తపై కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా స్పందించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.ఎస్.వి. రమణను వివరణ కోరారు.
గుత్తేదారును పిలిపించి మాట్లాడి, రోగులను ఇబ్బంది పెట్టడంపై ప్రశ్నించారు. రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. బాధ్యులైన సిబ్బందిని తొలగించామని గుత్తేదారు చెప్పినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




