*దుర్గగుడి అభివృద్ధికి లక్ష విరాళం*
విశాఖపట్నంలోని మాధురవాడకు చెందిన వంగపండు తిరుపతి , సత్యవతి దంపతులు శ్రీ కనకదుర్గ దేవస్థానం డెవలప్‌మెంటల్ ట్రస్ట్ పథకం కింద ఆలయానికి రూ. 1,00,116/- విరాళంగా అందించారు. ఆలయ చైర్మన్ బొర్రా బోరా రాధాకృష్ణ (గాంధీ) స్వీకరించారు.
విరాళం అందించిన దాతలకు ఆలయ మర్యాదలతోపాటు, వేద పండితులచే వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం, వారు అమ్మవారిని దర్శించుకుని, అమ్మవారి ఫోటో ప్రసాదం స్వీకరించారు.






