కర్నూలు :
పదవి వీరమణ పొందిన ఎఆర్ హెడ్ కానిస్టేబుల్ ను సన్మానించిన …కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు.సుధీర్ఘకాలం పోలీసుశాఖలో పని చేసి పోలీసు అధికారులు పదవి వీరమణ పొందడం అభినందనీయమని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు తెలిపారు.
ఆర్ముడు రిజర్వుడు విభాగం లో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ బి. శ్రీనివాసులు బుధవారం పదవి వీరమణ పొందారు. ఈ సంధర్బంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎఆర్ హెడ్ కానిస్టేబుల్ బి. శ్రీనివాసులు ను శాలువ, పూలమాలతో జిల్లా ఎస్పీ గారు సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.కుటుంబాలతో సంతోషంగా గడపాలని.
పదవివీరమణ పొందిన తర్వాత ఏమైనా సమస్యలుంటే నేరుగా జిల్లా ఎస్పీ గారిని సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, స్పెషల్ బ్రాంచ్ సిఐలు మధుసుధన్ రావు, కేశవరెడ్డి, ఆర్ ఐలు నారాయణ, జావేద్, ఆర్ ఎస్సై ప్రదీప్, పదవి వీరమణ పొందిన పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.




